మేడ్చల్‌లో బాలిక అదృశ్యం | Teenage girl missing in Medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో బాలిక అదృశ్యం

Published Fri, Jun 19 2015 6:19 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

Teenage girl missing in Medchal

రంగారెడ్డి (మేడ్చల్) : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో ఓ బాలిక అదృశ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కొండాపూర్‌లో ఉన్న రేసు వెంకట్‌రెడ్డి గార్డెన్‌లో వెంకన్న కుటుంబం పనిచేస్తూ అక్కడే ఉంటుంది. కాగా వెంకన్న కూతురు స్వప్న(17) గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. అయితే ఎంతసేపటికీ కూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువుల వద్ద ఆరా తీశారు. కానీ వారికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో స్వప్న తల్లి బుచ్చమ్మ శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement