
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు
ఖలీల్‌వాడీ,న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సం ఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ అంబేద్కర్ సంఘం నుంచి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘంగా మారుస్తూ తీర్మానించారని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ఉపాధ్యక్షు డు చెన్నయ్య తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రం లోని టీఎన్‌జీవోస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్త కార్యవర్గంలో తెలంగాణ అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లా నుంచి మర్రి కిరణ్‌కుమార్ ఎన్నికైనట్లు తెలిపారు. చిన్న రాష్ట్రాలతో దేశం అబివృద్ధి చెందుతుందని చెప్పిన అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన యూపీఏ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు రాకేష్,రాహుల్,అరవింద్ పాల్గొన్నారు.