తెలంగాణకు ఎయిమ్స్: బీజేపీ శాఖ ధన్యవాదాలు
Published Tue, Jul 29 2014 6:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్టానికి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ ధన్యవాదాలు తెలిపింది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ... ఆగస్టు 21, 22న తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఉంటుంది అని తెలిపారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.., అయినా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు.
Advertisement
Advertisement