సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ అనంతరం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది . దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది.విస్తరణ అనంతరం పూర్తిస్థాయి మంత్రివర్గం సమావేశం కావడం ఇదే తొలిసారి. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో 2019-20కు సంబంధించి వార్షిక బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం ఉదయం 11.30 గంటల నిమిషాలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఆర్థికమంత్రి హరీశ్ రావు శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించిన హరీష్ రావు సోమవారం పూర్థిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం వంటి అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.
Comments
Please login to add a commentAdd a comment