తొలిసారిగా సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ | telangana chief minister kcr get warm welcome at secretariat | Sakshi
Sakshi News home page

తొలిసారిగా సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్

Published Mon, Jun 2 2014 12:38 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

telangana chief minister kcr get warm welcome at secretariat

హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖర రావు తన మంత్రులతో కలిసి ఈ మధ్యాహ్నం తొలిసారిగా తెలంగాణ సచివాలయం చేరుకున్నారు. కేసీఆర్‌కు సచివాలయ ఉద్యోగులు రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ, బోనాలతో కేసీఆర్ కు మహిళలు స్వాగతం పలికారు.

అనంతరం సచివాలయం నల్లపోచమ్మ గుడిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఉద్యోగులు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులను ఆయన అభినందించారు. కేసీఆర్ తనయ కవిత, సీనియర్ నాయకుడు కేశవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement