
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ అసాధారణ విజయం సాధించినందుకు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతి కోసం పునరుత్తేజిత శక్తితో పనిచేసేందుకు ఈ విజయం మీ(ప్రధాని)కు స్ఫూర్తి నిస్తుందని అన్నారు. దేశాభివృద్ధికి మరింత ఉత్సాహం, నిబద్ధతతో మీరు పని చేస్తున్నారని ఆశిస్తున్నాఅంటూ... ఈ మేరకు కేసీఆర్ ప్రధానికు లేఖ రాశారు.