గట్ల జేసింది నేనే.. గిట్ల జేసింది నేనే | Telangana Elections Political Special Story | Sakshi
Sakshi News home page

గట్ల జేసింది నేనే.. గిట్ల జేసింది నేనే

Published Sat, Dec 1 2018 9:16 AM | Last Updated on Sat, Dec 1 2018 9:16 AM

Telangana Elections Political Special Story - Sakshi

కొందరంతే సెప్పుడు ఎక్కువ... జేసుడు తక్కువ. ఎప్పుడు గప్పాల్‌ కొడ్తనే ఉంటరు. అరే గిట్ల వాగితె ఎదుటోల్లు నవ్వుతరని కూడా సూడ్రు. అయినా గట్ల జెప్పకుంటె ఆల్లకి పొద్దు గడ్వదు. ఆల్లు సరె... మల్ల ఇన్కునేటోల్ల గతేంది? అరే చుప్‌..గేందిర నీ లొల్లి పరేసాన్‌ చేస్తున్నవ్‌ ...అని అనాలనున్నా...ఎందుకొచ్చిన తంట ఈల్లతో అనుకునేటోల్లే ఎక్కువ. మా దూరం బందువు కాకా ఉన్నడు. ఏదైన కార్యంల కలిస్తె ఇంగ అంతే...నల్గురున్న కాడు పోవుడు...కతల్‌ సురు జేసుడు. గవేమన్న జల్దీ ముగుస్తాయె. పాత సైనిమా సంపూర్ణ రామాయనంల సెబ్తునే ఉంటడు. పాపం ఇనేటోల్లు గాడ గీడ బిత్తరి సూపులు జూస్కుంట సందు దొరికితే సాలు ‘కాకా...ఆడు పిలుస్తుండు ఇప్పుడే వస్త మల్ల’...అంటూ ఉరుకుడే. ఆల్లు ఎల్లినా మన కాకాకు ఏం పికర్‌ లేదు. ఇంగో గుంపు జూస్కుని మల్లీ సురు జేసుడే.

ఎలచ్చన్ల పున్యమా అని గీ మధ్య ఏ మీటింగ్‌ల జూసిన మా కాకా లాంటి కాండేట్లే కనిపిస్తున్నరు. ఆల్ల  ముచ్చట్లు పిట్టల్‌దొర కబుర్లు లెక్కనుంటయ్‌. ‘జూసిండ్ర... గీ రోడ్డు నేనే ఏయించిన..గా బిల్డింగ్‌ నేనే కట్టించిన...మీ కొల్వులు నేనే ఇప్పించిన. గింత జేస్తున్న... ఓట్లేసి గెలిపించాలె మల్ల’ అంటుంటే గీ జనాలు ‘అరె పటేలా నువ్వేం జేసినవో మాకు దెల్సు...ఇంగేం జేస్తవో సెప్పు సాలు’ అని మనసుల అనుకుంటుండ్రు. పైకి మాత్రం సీటీలు కొడ్తుండ్రు. గిది జూస్కొని గా కాండేట్లు...ఆల్లు దెచ్చుకున్న బడా లీడర్లు రెచ్చిపోయి ఇంగ రీల్లు తిప్పుడే తిప్పుడు! గా ఎగస్‌ పార్టీ లీడరు ఎందుకూర్కుంటడు గెట్ల జేసినవ్‌ సెప్పుమల్ల? అని ఎదురు బానాలేస్తుండు.  

గిప్పుడు ప్రచారం టాప్‌ గేర్ల నడుస్తున్నాది. కూటమోల్ల మీటింగ్‌ల రాహుల్‌ సారు కేసీఆర్‌ని ఇంగ జేసింది సాల్లే గానీ...గా పార్మవుసుల పండుకో రాదె...అనిండు. సైకిల్‌ సారు గిదేం పట్టించుకోకుండ ...సైబరాబాదు నేనే గట్టిన...శంషాబాదు నేనే గట్టిన.. అని సెప్పిందే సెప్పి సావగొట్టిండు. హైద్రాబాద్‌ని పటంల పైన పెట్టిన అంటే... గులాబీ బాసు ‘మరి కరెంటు యాడ పెట్టినవ్‌’ అని కొచ్చెన్‌ ఇడిసిండు. తెలంగాణ వస్తే కరెంటు లేక జనాలు చీకట్ల ఉండాల్సిందె అన్నోల్లు గిప్పుడేమంటరు అని రంకెలేసిండు. గీయన గే మీటింగ్‌ల అయినా కరెంటు కత వదల్త లేడు.మేం లేకపోతె కాలేశ్వరం కట్టేవోల్ల...అంటుండు. కొంతల కొంత గీ సైకిలాయన నేను గట్టింది హైద్రాబాద్‌ కాదు...సైబరాబాద్‌ అని మెట్టు దిగి ఒప్పుకునిండు...గదే సాలు. కేసీఆర్‌ కూటమోల్లని గోల్‌మాలోల్లని ఉతికితే...రాహులు సారు గీయన్కి ఖావో కమీషన్‌ రావు అని కొత్త పేరు తగిలించిండు. ఇంగ ఆ కమలమోల్లు మోదీ..అమిత్‌ సార్లని పిలించి మేం గదిజేసినం గిది జేసినం అని జెప్పిస్తుండ్రు. ఆయుస్మాన్‌ పథకంల మీరు రాలేద్గద అంటే...గదో దిక్కుమాలిన పథకమని కేసీఆర్‌ ఏకిబారేసిండు.

ఈల్లెంత గత్తరి బిత్తరి జేసినా...పల్టీలు గొట్టినా నాల్గు దినాలె. గా సంగతి జనాల్కి బాగా దెల్సు. ఎన్ని ఎలచ్చన్లు సూడలె...ఓట్లు వేయలే! మాకు యాస్టికొచ్చింది...ఇంగ సాల్గాని సీటు ఖాళీ సేయండి సారూ అంటూ లాగేస్తరు. ఆల్ల దిమాక్‌ని మాత్రం దక్కువ జేయకండ్రి... గుంతల తోస్తరు!    – రామదుర్గం మధుసూదనరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement