సాక్క్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకై రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి శివ శంకర్ 141 జీవోను విడుదల చేశారు. ఇందులో 15-డిప్యూటీ జైలర్ పోస్టులు, 2-అసిస్టెంట్ మాట్రాన్, 186- వార్డెన్(పురుషుల) పోస్టులు, 35-వార్డెన్(మహిళ) పోస్టులతో మొత్తం 238 పోస్టుల భర్తీ కై ప్రభుత్వం జీ.వో ను విడుదల చేసింది.
ఆరు నెలల క్రితం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు నగేష్ యాదవ్, సైనిక్ సింగ్‌లు పారిపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జైళ్లశాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాకబు చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 300 పోస్టులకు గాను.. 238 పోస్టులను భర్తీ కోసం జీ.వో విడుదల చేసింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 19 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులను డైరెక్ట్‌గా రిక్రూట్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment