బతుకమ్మ కోసం ప్రత్యేక వెబ్సైట్
హైదరాబాద్: ఇంటర్నెట్ వేదికగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా బతుకమ్మ పేరిట సోషల్ మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టింది. ఫేస్బుక్ లో బతుకమ్మ కోసం ప్రత్యేక పేజీ పెట్టింది.
ప్రత్యేక వెబ్సైట్ www.bathukamma.telangana.gov.in తయారుచేయించింది. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో జరిగే బతుకమ్మ వేడుకలను యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.