ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా నిర్వహిస్తాం
హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య తెలిపారు. నిమ్స్ స్థాయి వైద్యాన్ని గ్రామీణ ప్రాంతానికి అందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన శనివారమిక్కడ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అదనపు మెడికల్ సీట్లు కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని రాజయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంతో పాటు 108 సేవలను కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.