చెరువులకు జియో ట్యాగింగ్: హరీశ్
సాక్షి, హైదరాబాద్: చెరువులకు జియో ట్యాగింగ్ చేయాలని నీటి పారుదల శాఖ నిర్ణరుుంచింది. ఈనెల 29న ప్రారంభం కానున్న ఈ ప్రక్రియను డిసెంబర్ 2వ తేదీకల్లా పూర్తయ్యేలా చూడాలని అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జియో ట్యాగింగ్‌పై మొబైల్ యాప్‌ను రూపొందించినట్టు ’కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్ శనివారం తెలిపారు.
జియో ట్యాగింగ్ చేసే విధానంపై క్షేత్రస్థారుు ఇంజనీర్లకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. జియో ట్యాగింగ్ పనుల పురోగతిని ఇరిగేషన్ సిబ్బంది ప్రతిరోజూ సంబంధిత చీఫ్ ఇంజనీరుకు తెలపాలని హరీశ్‌రావు ఆదేశించారు. జియో ట్యాగింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జియో ట్యాగ్ చేయడం వల్ల ప్రతి చెరువు ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలో ఉన్నదో, దాని కొలతలు, విస్తీర్ణం, ఫొటోలు, పేరు, ఇతర వివరాలతో సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌లో ప్రభుత్వ నీటి పారుదల వెబ్‌సైట్‌లో నమోదవుతుంది.