సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్-2 నియామక ఎంపిక ప్రక్రియకు సోమవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జాబితా నుంచి తొలగించిన 343 మంది అభ్యర్థుల పత్రాలను పునర్‌సమీక్షించాలని టీఎస్‌పీఎస్సీను హైకోర్టు ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్‌నర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో గతంలో తొలగించిన 343 మందికి ఊరట లభించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 3147 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల వెరిఫికేషన్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో 1:2 రేషియో పద్దతిలో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. 1032 పోస్టులకు 1:3 రేషియోలో 3147 మంది అభ్యర్థులు సెలెక్టయిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై స్పందించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment