ganta chakrapaani
-
నోటిఫికేషన్లకు... కోరం ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కోరం నిబంధనతో వీలైనంత త్వరగా కొత్త నియామకాలను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రస్తుత చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీల ఆరేళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగియనుంది. ఆ తర్వాత కమిషన్‌లో కేవలం ఇద్దరు సభ్యులు... కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సీలో కోరం ఉండాల్సిందే. కమిషన్ చైర్మన్‌తో పాటు కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి. కానీ ఈ నెల 17 తర్వాత కమిషన్‌లో ఇద్దరే మిగులుతారు. కాబట్టి కొత్త చైర్మన్‌తో పాటు కనీసం ఒక సభ్యుడిని ప్రభుత్వం వీలైనంత త్వరగా నియమిస్తేనే ఉద్యోగ ప్రకటనల జారీకి ఇబ్బందులు ఉండవు. రాజ్యాంగం ప్రకారం చైర్మన్, సభ్యుల కాలపరిమితి పెంచే అవకాశం లేకపోవడంతో కొత్త నియామకాలు అనివార్యం కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుత కమిషన్‌లో ఈనెల 17 తర్వాత మిగిలే ఇద్దరు సభ్యుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఒకరి, అక్టోబర్‌లో మరొకరి పదవీ కాలం ముగుస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల లెక్కలను తీసే పనిలో వివిధ ప్రభుత్వశాఖలు ఉన్నాయి. ఖాళీల లెక్క తేలాక ప్రభుత్వం వీటి భర్తీకి ఇండెంట్లు ఇస్తే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. పదవీ విరమణ ఉత్తర్వులు జారీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, బి.చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ ఈ నెల 17న పదవీ విరమణ చేస్తారని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారంఉత్తర్వులు జారీ చేశారు. -
గ్రూప్-2కి హైకోర్టులో లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్-2 నియామక ఎంపిక ప్రక్రియకు సోమవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జాబితా నుంచి తొలగించిన 343 మంది అభ్యర్థుల పత్రాలను పునర్‌సమీక్షించాలని టీఎస్పీఎస్సీను హైకోర్టు ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్నర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో గతంలో తొలగించిన 343 మందికి ఊరట లభించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 3147 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల వెరిఫికేషన్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో 1:2 రేషియో పద్దతిలో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. 1032 పోస్టులకు 1:3 రేషియోలో 3147 మంది అభ్యర్థులు సెలెక్టయిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై స్పందించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తామన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి'
సాక్షి, హైదరాబాద్: 4,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఒక ప్రకటనలో పేర్కొంది. శాఖల నుంచి పూర్తి వివరాలు వచ్చాక నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొంది. ఈలోగా నిరుద్యోగులంతా వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను వేగంగా చేపట్టవచ్చని వెల్లడిచింది. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాక సమాచారం వెళ్తుందని, ఆ రిఫరెన్సు నెంబరు, ఇతర వివరాలతో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడిచింది. కాగా ఇప్పటివరకు దాదాపు 1.70 లక్షల మంది నిరుద్యోగులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.