సాక్షి, హైదరాబాద్: 4,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఒక ప్రకటనలో పేర్కొంది. శాఖల నుంచి పూర్తి వివరాలు వచ్చాక నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొంది. ఈలోగా నిరుద్యోగులంతా వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తద్వారా నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను వేగంగా చేపట్టవచ్చని వెల్లడిచింది. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాక సమాచారం వెళ్తుందని, ఆ రిఫరెన్సు నెంబరు, ఇతర వివరాలతో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడిచింది. కాగా ఇప్పటివరకు దాదాపు 1.70 లక్షల మంది నిరుద్యోగులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.