సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ పరిధిలో ఆక్రమణలు జరుగుతున్నాయన్న అంశంపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ప్రముఖ సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. హుస్సేన్ సాగర్‌లో ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్లాట్లు చేశారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఆక్రమణలు తొలగించి, అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును లుబ్నా సార్వత్ కోరారు. దీనిపై సీనియర్ న్యాయవాది రవిచంద్రన్‌ను అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది. విచారణలో భాగంగా సీఎస్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పీసీబీ, జలమండలికి హైకోర్టు నోటీసులిచ్చింది. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment