కె.చంద్రశేఖర రావు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామన్నారు.
అలాగే హైదరాబాద్ - వరంగల్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ జౌళి నిలయంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. పారిశ్రామిక పార్కులు, వ్యాట్ హేతుబద్ధీకరణ, పారిశ్రామిక కార్మికుల రక్షణ మొదలైన అంశాలపై శ్రద్ధ పెడతామని చెప్పారు. విద్యుత్, నీటి సదుపాయాలను కూడా మెరుగు పరుస్తామని సభలో కేసీఆర్ చెప్పారు.
**