
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నివసించే వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థానాల్లో పోటీ చేస్తుండడం విశేషం.వీరందరూ ప్రధాన పార్టీల అభ్యర్థులే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దాదాపు 78 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. సీఎం కేసీఆర్ నివాసం ప్రగతిభవన్ కూడా ఇదే నియోజకవర్గంలోని సోమాజిగూడలో ఉంది. ఇక మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్‌లోనివసిస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తుండగా,కేటీఆర్ సిరిసిల్ల నుంచి బరిలో ఉన్నారు.
♦ కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థులైన దామోదర రాజనర్సింహ జూబ్లీహిల్స్ రోడ్ నెం.92లో, సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) శ్రీనగర్ కాలనీలో, పొన్నాల లక్ష్మయ్య (జనగామ) జూబ్లీహిల్స్ రోడ్ నెం.92లో, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ) లోటస్‌పాండ్‌లో, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు) ఫిలింనగర్‌లో, రేవంత్‌రెడ్డి (కొడంగల్) జూబ్లీహిల్స్‌లో, డీకే అరుణ (గద్వాల్) జూబ్లీహిల్స్‌లో, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్), ఆయన సతీమణి పద్మావతి (కోదాడ) బంజారాహిల్స్ రోడ్ నెం.12లో, జానారెడ్డి (నాగార్జునసాగర్) బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నివాసం ఉంటున్నారు.
♦ మరోవైపు
పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో, కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి ఎమ్మెల్యే కాలనీలో, గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్‌గౌడ్ ఎమ్మెల్యే కాలనీలో, భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నం బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని మిథిలానగర్‌లో ఉంటున్నారు.
♦ ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థులు లక్ష్మారెడ్డి (జడ్చర్ల) నందగిరిహిల్స్‌లో, మర్రి జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్) జూబ్లీహిల్స్ రోడ్ నెం.62లో, తుమ్మల నాగేశ్వర్‌రావు (పాలేరు) జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లో, పట్నం మహేందర్‌రెడ్డి ( తాండూరు) బంజారాహిల్స్ రోడ్ నెం.12లో, పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్) శ్రీనగర్ కాలనీలో, బాల్క సుమన్ (చెన్నూరు) బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు.
♦ చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో, ఆందోలు బీజేపీ అభ్యర్థి
బాబుమోహన్ ఫిలింనగర్‌లో నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment