ఆయన తీరు చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది | Telangana Minister Harish Rao fires on Andhrapradesh CM Chandrababu | Sakshi
Sakshi News home page

ఆయన తీరు చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది

Published Mon, Jun 15 2015 7:58 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ఆయన తీరు చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది - Sakshi

ఆయన తీరు చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది

నల్గొండ (సూర్యాపేట) : ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నైతికత ఉంటే చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని, లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సోమవారం నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ వద్ద నిర్మాణం అవుతున్న వంతెన పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డిలతో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శించారు. దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగుతున్నారని చెప్పారు. చట్టం అందరి దృష్టిలో ఒక్కటేనని, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. చట్టం సీఎంకైనా అయినా, సామాన్య ప్రజలకైనా ఒక్కటేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement