
సాక్షి, నిజామాబాద్: మహమ్మారి కరోనా ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రాణాంతక వైరస్ భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అంటువ్యాధిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా ముఖ్యంగా వలస కూలీలు, విదేశాల్లో చిక్కుకుపోయిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలు తీరక వేదన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో పనిచేసే తెలంగాణ వాసులు వాట్సాప్ ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నారు.(భారత్‌కు వచ్చేస్తానంటూ కోర్టుకెక్కిన గర్భిణీ)
ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లి ఆస్పత్రిలో పనిచేస్తున్నామని.. కరోనా విజృంభణ నేపథ్యంలో తమలో 10 మందికి వైరస్ సోకిందని తెలిపారు. వారితో పాటే తమను ఒకే క్యాంపులో ఉంచుతున్నారని.. కనీసం తమకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 40 మంది వాట్సాప్ ద్వారా గల్ఫ్ సంక్షేమ సంఘానికి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment