ఐటీ కాంగ్రెస్ తో తెలంగాణకు గుర్తింపు: కేటీఆర్
ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైందని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాస్కామ్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మొదటిసారి దేశంలో జరుగుతోందని తెలియజేశారు. ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018లో నిర్వహించే ఐటీ కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తుందని తెలిపారు.