ప్రజలంతా మా వైపే | Telangana state in Warangal Special Recognition | Sakshi
Sakshi News home page

ప్రజలంతా మా వైపే

Published Mon, Apr 25 2016 1:23 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ప్రజలంతా మా వైపే - Sakshi

ప్రజలంతా మా వైపే

తెలంగాణలో వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు  
రాష్ట్రంలో అవినీతి రహిత పాలన
ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి

 
 
సాక్షిప్రతినిధి, వరంగల్ : టీఆర్‌ఎస్ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తరుుంది. ఈనెల 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్ల పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తొలి ముఖ్యమంత్రిగా పార్టీ అధినేత కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పార్టీలోని అంశాల గురించి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. అవి ఆయన మాటల్లోనే... తెలంగాణ సాధన కోసం 2001లో ఏర్పాటైన టీఆర్‌ఎస్ మొదటి లక్ష్యాన్ని పూర్తి చేసింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోంది. అన్ని స్థాయిల్లో అవినీతి లేకుండా అభివృద్ధి జరుగుతోంది.

టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కరెంటు సమస్యను పరి ష్కరించింది. 2019 ఎన్నికలలోపు అందరికీ తా గునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నార ుు. రాష్ట్రంలో ని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. చెరువులకు జల కళ తెప్పించేందుకు మిషన్ కాకతీయ పనులు జోరుగా సాగుతున్నారుు. సామాజిక పిం ఛన్లు, రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాల అమలులో దేశంలోని అన్ని రాష్ట్రాలకు టీఆర్‌ఎస్ సర్కార్ ఆదర్శంగా నిలుస్తోంది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం త్వరలోనే ఊపందుకోనుంది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఆమోదం తెలపడమే ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. వరంగల్ లోక్‌సభ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే భవిష్యత్తులోనూ వస్తాయి.


 వరంగల్‌పై ప్రత్యేక శ్రద్ధ...
 తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వరంగల్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అన్ని కీలక దశల్లోనూ వరంగల్ నగరానిది గొప్ప పాత్ర. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీ ఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు ప్రాధాన్యత పెంచింది. హైదరాబాద్ తర్వాత అన్నింటికీ వరంగలే కేంద్రం అనే భావన తెచ్చింది. నగరానికి ఉన్న చారిత్రక గుర్తింపును నిలబెట్టేలా ప్రభుత్వం పని చేస్తోంది. సామాన్య ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలో పెట్టి గుర్తింపు తెచ్చారు. గ్రామాలకు ఆయువుపట్టుగా ఉండే చెరువులను అభివృద్ధి చేసే పథకానికి మిషన్ కాకతీయ పేరు పెట్టారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని నిర్ణయించారు.

హైదరాబాద్ తర్వాత పండ్ల మార్కెట్‌ను ఇక్కడే ఏర్పా టు చేస్తున్నారు. రూ.10 కోట్లతో కూరగాయ లు, ఉల్లిగడ్డ మార్కెట్లు ఏర్పాటవుతున్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా వరంగల్ నగరంలోని భద్రకాళి, వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి చెరువులను అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌లుగా మార్చుతున్నాం. కాకతీయుల కాలంనాటి చెరువులకు మళ్లీ పాత వైభవం తీసుకొస్తున్నాం.


 ప్లీనరీకి తరలి రావాలి...
టీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఖమ్మంలో పార్టీ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీ, బహిరంగసభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రతినిధులు కలిపి మన జిల్లా నుంచి 400 మంది ప్లీనరీకి హాజరుకానున్నారు. డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల నుంచి సగటున 15 వేల మంది బహిరంగసభకు హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాము. నామినేటెడ్ పదవుల భర్తీపైనా పార్టీ దృష్టి సారించింది. త్వరలోనే అన్ని స్థాయిల పదవులు భర్తీ కానున్నాయి. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి.  
 
 
 విద్యా కేంద్రంగా ఓరుగల్లు ...
 గత ప్రభుత్వాలు వరంగల్‌ను పట్టించుకోలేదు. వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. వరంగల్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ముందుకెళ్తోంది. వరంగల్ కార్పొరేషన్‌కు గ్రేటర్ హోదా కల్పించింది. వరంగల్ నగరం, సమీప ప్రాం తాల్లోని ప్రజల చిరకాల కోరికైన వరంగల్ పోలీస్ కమిషరేట్‌ను ఏర్పాటు చేసింది. వరంగల్‌ను సాంస్కృతిక కేంద్రంగా మార్చేం దుకు రూ.50 కోట్లతో కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మిస్తోంది. విద్యా కేంద్రంగా మార్చే విషయంలోనూ  ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. రాష్ట్రంలో ని ఏకైక వైద్య విద్యాలయం వరంగల్‌లోనే ఏ ర్పాటు కాబోతోంది. రాష్ట్రంలో వైద్య విద్యకు సంబంధించి ఏకైక విశ్వవిద్యాలయం కూడా వరంగల్‌లోనే ఏర్పాటైంది.

దక్షిణ భారతదేశంలో మొదటి గిరిజన యూనివర్సిటీ వరంగల్‌కే మంజూరైంది. సైనిక్ స్కూల్ రాబోతోం ది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అందుబాటులోకి రానుంది. వ్యవసాయ, పశుసంవర్ధక కా లేజీలు, పరిశోధన సంస్థలను గ్రేటర్ వరంగల్ పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement