పెద్దవూర : పనులు ప్రారంభిస్తున్న కోటిరెడ్డి
పెద్దవూర : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలుపర్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపీపీ వస్తపురి మల్లిక, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఎంసీ కోటిరెడ్డిలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రామాలయం పక్క వీధిలో రూ.5 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను, రైతు పెట్టుబడికి ఎకరాకు రూ.4వేలు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ నిర్విరామంగా కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని తనాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ కూతాటి భానుశ్రీదేశ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి, మేరెడ్డి జైపాల్‌రెడ్డి, బోయ నరేందర్‌రెడ్డి, నడ్డి లింగయ్యయాదవ్, ఏఎంసీ డైరెక్టర్ నడ్డి లక్ష్మయ్యయాదవ్, పులిమాల కృష్ణారావు, వస్తపురి నర్సింహ, కర్నాటి ప్రతాప్‌రెడ్డి, డైమండ్ బ్రదర్స్, ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : గ్రామాల అభివృద్ధిలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 12.69 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు మంజూరైనట్లు టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రంగుండ్ల తండాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన రూ. 5 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ అల్లి నాగమణిపెద్దిరాజు యాదవ్, గ్రామ సర్పంచ్ ఆంగోతు భగవాన్ నాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆంగోతు సూర్యభాషా నాయక్, ఎంపీటీసీ బుర్రి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ చవ్వా బ్రహ్మనందరెడ్డి, నిడమనూరు సింగిల్‌విండో వైస్ చైర్మన్ కేతావత్ భిక్షా నాయక్, నాగేండ్ల కృష్ణారెడ్డి, ఆంగోతు ఫకీర, జవహర్‌నాయక్, చల్ల సోమశేఖర్, దుబ్బ శివాజీ, చింతలచెరువు శ్రీను, బాబురావు నాయక్, ఆంగోతు మంగ్తా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment