doveloped
-
అభివృద్ధికి గ్రహణం
నర్సంపేట: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందాన తయారైంది నర్సంపేట పట్టణ పరిస్థితి. సుందరీకరణ కోసం ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి టీయూఎఫ్ఐడీసీ జీఓ 51 ద్వారా రూ.35 కోట ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. పనులు పూర్తి చేసేందుకు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. పట్టణ ప్రజలకు కనీస వసతులు లేకుండా పోయింది. విడుదలైన నిధులతో డబుల్, సింగిల్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, ప్రధాన జంక్షన్లు, కుమ్మరికుంట పార్కు, సైడ్ డ్రెయినేజీ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణం, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాళ్లు, కూరగాయల మార్కెట్, ఆడిటోరియం, అంబేడ్కర్ భవన్ లాంటి అభివృద్ధి పనులతో పట్టణ సుందరీకరణ కోసం నిధులను కేటాయించారు. అప్పట్లోనే ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయి అధికారులను నర్సంపేటకు తీసుకువచ్చి అభివృద్ధి పనుల ప్రణాళికపై వివరించి సకాలంలో పూర్తిచేసే విధంగా సహకరించాలని కోరారు. కాని సంబంధిత అధికారులు ఉదాసీనత పాటించారు. పట్టణంలోని డివైడర్ల పనులు కొనసాగుతుండగా రూ.3 కోట్లతో కుమ్మరికుంట పార్కు అభివృద్ధి చేయాల్సిన పనులతో పాటు రూ.15 కోట్లతో నిర్మించాల్సిన 33 కమ్యూనిటీ భవనాలు నిర్మాణం పనులు అటకెక్కాయి. 7 కమ్యూనిటీ భవనాలకు మాత్రమే టెండర్లు పూర్తికాగా 26 భవన నిర్మాణాల కోసం టెండర్లు, 5 కోట్లతో నిర్మించాల్సిన ఎస్సీ ఆడిటోరియం , 30 లక్షలతో ఏర్పాటు కానున్న లైబ్రరీ పనులకు టెండర్లు జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ సాకుతో అధికారులు పట్టణ అభివృద్ధిపై పట్టింపులేకపోవడం వల్లనే పూర్తిస్థాయి అభివృద్ధి ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.. పట్టణ సుందరీకరణలో జరగాల్సిన పనులకు టెండర్ల ప్రక్రియ చేయని వాటిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ సుందరీకరణ కోసం పట్టు బట్టి రూ.35 కోట్లు విడుదల చేయించినప్పటికీ టెండర్లు పూర్తిస్థాయిలో నిర్వహించని పనులకు సంబంధించిన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వెంటనే చేయాలని పూర్తిస్థాయి పనుల నిర్మాణానికి వెంటనే టెండర్లను నిర్వహించాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు తాగునీరందించేందుకు మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు అనుసంధానంగా గతంలో ఉన్న పైప్‌లైన్‌కు లింకేజీ ఇస్తూ సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నర్సంపేట పట్టణాన్ని గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ఇంటింటికీ కావాల్సిన మొక్కలను అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ వెంకటరమణారెడ్డి, మునిసిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, కమిషనర్ వెంకటేశ్వర్లు, త్రిబుల్ ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, ఏఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
రమణంపల్లి పునర్నిర్మాణానికి అడుగులు
మాడ్గుల: వంద సంవత్సరాల క్రితం కనుమరుగైన రమణంపల్లి గ్రామం పునర్నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడి నుంచి వివిధ గ్రామాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థ సహకారంతో ముందుకు వస్తున్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి–ఆర్కపల్లి గ్రామాల సమీపంలో రమణంపల్లి గ్రామం ఉన్నట్లు రికార్డుల్లో మాత్రమే పేర్కొనబడి ఉంది. ఆ గ్రామంలో పూర్వం అంటువ్యాధుల బారిన పడడంతో స్థానికులు గ్రామాన్ని వదిలిపెట్టి సుద్దపల్లి, ఆర్కపల్లికి వెళ్లి అక్కడే తలదాచుకుని కాలక్రమేణ ఆయా గ్రామాల్లోనే స్థిరపడ్డారు. అయితే వారు తమ పూర్వీకుల గ్రామాన్ని పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రమణంపల్లి గ్రామం ఉన్న ప్రదేశాన్ని గతంలో గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ (వీఆర్ఓ) వారు కొనుగోలు చేసి ఆ సంస్థ ప్రతినిధితో పాటు ఇద్దరు స్థానికుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ స్థలంలో మొదటి విడత 20 మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరికే ఆ సంస్థ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మిగతా వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో లబ్ధి పొందిన కుటుంబాలు సైతం పరిసర ప్రాంతంలో పెద్ద అడవి ఉందన్న భయంతో ఇళ్లలోకి వెళ్లలేదు. దీంతో ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. కాగా, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వారి కుటుంబీకుల పేర విరాసత్ కావడంతో సదరు వ్యక్తులు తమ సొంత ఆస్తులుగా భావిస్తూ తమను ఇళ్లకు రానివ్వడం లేదని లబ్ధిదారుల వారసులు ఆరోపిస్తున్నారు. మాకు కేటాయించిన ఇళ్లను అçప్పగించాలి మాకు గతంలో వీఆర్ఓ సంస్థ వారు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. దొంగలు, అడవి జంతువుల బెడదతో పాటు విద్యుత్ సౌకర్యం లేదని మేము ఇళ్లలోకి వెళ్లలేదు. ప్రస్తుతం ఆ భయం లేనందును మాకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్తాం. మా ఇళ్లను కొంతమంది కబ్జా చేసుకుని స్థలం తమదేనంటూ బెదిరిస్తున్నారు. –ఏదుల రాములమ్మ, సుద్దపల్లి వారసులకు ఇళ్లు ఇప్పించేందుకు కృషి గతంలో వీఆర్ఓ సంస్థ వారు డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల వారసులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషిచేస్తున్నాం. సంస్థ కొనుగోలు చేసిన భూమికి సంస్థ ప్రతినిధితో పాటు ఇద్దరు వ్యక్తులను గార్డియన్‌గా పెడితే వారి వారసులు భూమి తమదని చెప్పడం విడ్డూరం. గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించి సంస్థ సహకారంతో డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తాం. – యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, సర్పంచ్, సుద్దపల్లి -
కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి కనిపించడం లేదా?
రెబ్బెన: స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ల చొరవతో రెబ్బెన మండలంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించటం లేదా అని ఎంపీపీ కార్నాథం సంజీవ్‌కుమార్ ప్రశ్నించారు. గురువారం మం డల కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వంకులంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పా ర్టీ నాయకులు తమ ప్రభుత్వ హయాంలోనే రెబ్బె న మండలంలో అభివృద్ధి జరిగిందని టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ది చేయలేదని వ్యాఖ్యానించట్టా న్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అద్వానంగా ఉన్న అంతర్గత రోడ్లతో ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రత్యేక చొరవతో మండలంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహాదారుల కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశారన్నారు. సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నాగయ్య, సర్పంచ్ గజ్జల సుశీల, నాయకులు చెన్న సోమశేఖర్, సుదర్శన్‌గౌడ్, శ్రీధర్, నవీన్ జైస్వాల్, చిరంజీవిగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, వసంత్‌రావు, గజ్జల సత్యనారాయణ, రాజాగౌడ్, వినోద్‌జైస్వాల్ పాల్గొన్నారు. -
ప్రజలు మీసం తిప్పే రోజులు రావాలి
గీసుకొండ(పరకాల): ‘మా నాయకుడు మంచి పని చేశాడంటూ ప్రజలు మీసం తిప్పే రోజులు రావాలి.. అంతే కానీ ఎవరో ఓ నాయకుడు ఇంట్లో కూర్చుని అంతా నేనే అంటూ మీసం తిప్పడం సరికాదు. నేను పట్టుబడితే అభివృద్ధి కాదు.. విజయాలు వెనుక నడుచుకుంటూ రావాల్సిందే.. దమ్ముంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పోటీకి రండి చూసుకుందాం..’ అని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 2, 3, 4వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ధర్మారంలో ఏర్పాటు చేసిన సభలో మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని. ఎమ్మెల్యేకు లక్ష్మణుడిగా, ఆంజనేయుడిగా ఉంటానన్నారు. ఇటీవల మేయర్ నన్నపునేని నరేందర్ పలు సమావేశాలు, కార్యక్రమాలతోపాటు వాట్సప్ సందేశాల్లో సొంత పార్టీలోని ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో ధర్మారం సభలోనూ తన ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన ఆయన.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రశంసల జల్లు కురిపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను మేయర్ హోదాలో చల్లా ధర్మారెడ్డికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. నమ్ముకున్న వారికి అండగా నిలిచే స్వభావం చల్లా ధర్మారెడ్డిది అని తెలిపారు. 3వ డివిజన్లోని ధర్మారంలో పండ్ల మార్కెట్, హోల్‌సేల్ వ్యాపారుల మార్కెట్ వస్తోందని, ఇవే కాకుండా మండలంలో టెక్స్టైల్ పార్కు, జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం చేకూరుతుందని తెలిపారు. స్థానిక రైతులు భూములను అమ్ముకోవద్దని, రానున్న రోజుల్లో «భూమి ధర పెరిగే అవకాశం ఉందని అన్నారు. త్వరలో విలీన గ్రామాల ప్రజలకు సాదామైనామాల ద్వారా పట్టా చేసుకునే అవకాశం, గొర్ల పెంపంకందార్లకు యూనిట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరామని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. విలీన గ్రామాల్లో ఇప్పటికే రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగం మౌనిక, ల్యాదెల్ల బాలు, టీఆర్ఎస్ నాయకులు సుంకరి శివ, గోలి రాజయ్య, మసూ ద్, జోషి, బిల్ల శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలీస్ ధర్మారావు, కార్యదర్శి పూండ్రు జయపాల్‌రెడ్డి, ‘నెక్’ ఉమ్మడి జిల్లా చైర్మన్ వీరగో ని రాజ్‌కుమార్, ఎంపీపీ ముంత కళావతి, మండ ల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మాధవరెడ్డి, ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సందెల సునీల్. జాగృతి నాయకులు పోలెబోయిన సాంబయ్య పాల్గొన్నారు. -
అధికార పార్టీ..అడ్డ‘దారి’
జిల్లాలో ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా.. టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి దక్కించుకుంటున్నారు. ఈ కోవలోనే కర్నూలు నగరంలో జరుగుతున్న పనులకు టెండర్ పెట్టారు. ఏకంగా రూ.1.25 కోట్ల పనులను సబ్లీజ్తో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇంజినీరింగ్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండడంచర్చనీయాంశమైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు ప్రతిపాదనలు అడగకపోవడం వివక్షకు తావిస్తోంది. ఎన్నికల కోసమే... ప్రతి నియోజకవర్గం నుంచి రహదారులు, భవనాల శాఖకు వందలాది పనుల కోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు సైతం దెబ్బతిని ఉండడంతో మరమ్మతులు, నూతన రహదారులు, అవసరమైన కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో అనుమతి లభించిన పనులు మాత్రం స్వల్పంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు పనులకు అనుమతి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఆశించిన ఫలితం లభించకపోవడంతో ప్రజలకు ముఖం చాటేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని కొందరు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండడంతో కొన్ని పనులైనా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో రూ.15 కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనుల వివరాల ప్రతిపాదలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి రూ.120 కోట్ల పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు తీసుకోవడం మంజూరయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష... కర్నూలు జిల్లాలో మొత్తం 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. అయితే ఐదుగురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడంతో అధికార పార్టీలో 8 మంది, ప్రతిపక్ష పార్టీలో ఆరుగురు ఉన్నారు. ఇందులో 8 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో రహదారులు, ఇతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఉన్న ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోలేదని తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇది తమపై వివక్ష చూపడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు తీరుపై తీవ్ర ఆక్షేపణలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతోంది. ఇది మొదటి నుంచి జరుగుతోంది. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జ్‌ల పేరుతో పనులు చేయించారు. ఇప్పుడు కేవలం టీడీపీ వారికే పనులు మంజూరు చేస్తున్నారు. మావి నియోజకవర్గాలు కాదా?..మా దగ్గర ఉన్నది ప్రజలు కాదా? వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. -
శిల్పారామం..ఇక కొత్త రూపం!
జిల్లాలో కడపతోపాటు పులివెందులలో శిల్పారామాలు ఉన్నాయి. రోజువారి జీవితంలో అలసిన వారికి ఈ ఆరామాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేసి పదేళ్లు కావస్తోంది. చిన్నచిన్న మార్పులు మినహా మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దగా మార్పులేవీ జరగలేదు. ఇటీవల సందర్శకులు నూతనత్వం కొరవడిందని పెదవి విరుస్తున్నారు. ఒక దశలో శిల్పారామాల నిర్వహణ ప్రభుత్వానికి బరువుగా మారింది. ప్రతి ఆదివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా స్థానికంగా స్పాన్సర్లను వెతుక్కోవలసి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం దీన్ని గమనించి కొత్త అందాలతో శిల్పారామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. రాష్ట్ర శిల్పారామాల స్పెషలాఫీసర్ బి.జయరాజ్ కడప శిల్పారామంలో చేపట్టాల్సిన మార్పులను పరిశీలించేందుకు కడప నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కడప కల్చరల్ : కడప, పులివెందుల శిల్పారామాలలో జనం సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. కారణం? ఆదాయం తగ్గలేదుగానీ పెరగని మాట నిజమే. ఆశించిన మేరకు ఆర్థికంగా అభివృద్ధి కనిపించడం లేదు. మీ దృష్టికి వచ్చిన లోపాలు ఏమిటి? నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? కడప శిల్పారామం నగరం నుంచి దూరమని పలువురు ప్రజలు భావిస్తున్నారు. ఎస్టేట్ తర్వాత మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ ఇటీవల నగరం వైపు నుంచి రైల్వేట్రాక్ వరకు, శిల్పారామం నుంచి పెట్రోలు బంకు వరకు అక్కడక్కడా భవనాలు వెలిశాయి. జనం సందడి పెరుగుతోంది. శిల్పారామాల పూర్తిస్థాయి అభివృద్ధికి చేపట్టనున్న చర్యలేమిటి? వీటిని పూర్తిగా ఆధునికీకరిస్తాం. స్థానికతను కోల్పోకుండా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సందర్శకులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. వారు ఉల్లాసంగా గడిపేందుకు శిల్పారామానికి కొత్త లుక్ వచ్చేలా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏమేం మార్పులు చేపడతారు? ముఖ్యంగా వినోదానికి, ఉల్లాసంగా గడపడానికి అనుగుణంగా మార్పులు చేస్తాం. కొన్ని సాంకేతిక కారణాలతో గ్రీనరీ (పచ్చిక) లేకుండా పోయింది. కడప శిల్పారామంలో ఓ భాగాన్ని పూర్తిగా పచ్చికతో నింపుతాం. ప్రస్తుతం షాపింగ్ స్టాల్స్ దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి. వాటిని ఎదురెదురుగా దగ్గరలో ఉండేటట్లు మారుస్తాం. తరుచూ హస్తకళా రూపాల ప్రదర్శన, విక్రయాలు ఏర్పాటు చేస్తాం. నైపుణ్యం గల కళాకారులకు స్టాల్స్‌ను ఉచితంగా ఇస్తాం. సందర్శకుల కోసం పాత్‌వేలను అభివృద్ధి చేస్తాం. సౌకర్యవంతంగా సేద తీరేందుకు పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రత్యేకించి వినోదం కోసం ఏం చేస్తున్నారు? కడప శిల్పారామానికి పడమర వైపునగల చెరువును నీటితో నింపి బోటింగ్, వాటర్‌గేమ్స్ నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. 56 ఎకరాల చెరువులో 40 ఎకరాల్లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం! ఆధునీకరణ అన్నారు...వివరాలు చెప్పగలరా..? ఆధునీకరణ కోసం అంతర్జాతీయ అనుభవం గల ఇద్దరు యువ అర్కిటెక్చర్లకు ఈ పని అప్పగించాం. వారు ప్రత్యేకించి కడప శిల్పారామాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. ఇప్పటికే ఇక్కడ పర్యటించి సందర్శకుల అభిప్రాయాలు సేకరించారు. ఆ ప్రణాళిక అమలైతే కడప శిల్పారామానికి కొత్త లుక్ వస్తుందని చెప్పగలను. సందర్శకులను ఆకట్టుకునేందుకు సీమ రుచులు లాగా స్థానిక వంటకాలు, ఆహార పదార్థాలు, అల్పాహారం అందించేందుకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయని భావిస్తున్నారు? ఈనెలాఖరుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. కార్యాలయ పరమైన అనుమతులు అనంతరం సీఎం ఆమోదంతో వెంటనే పనులు చేపడతాం. జూలై నాటికి దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయగలమన్న విశ్వాసం ఉంది. ఈ పనులను ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యాల సమ్మేళనంతో 40–60 శాతం పద్ధతిలో చేపడుతాం. రాష్ట్రంలో శిల్పారామాల పరిస్థితి ఎలా ఉంది? పులివెందుల శిల్పారామాన్ని ఆధునీకరించి ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చేందుకు అంచనాలు రూపొందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది శిల్పారామాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రస్తుతం కడపతోపాటు తిరుపతి, విశాఖ, అనంతపురం, పుట్టపర్తిలలో శిల్పారామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, కాకినాడ, విజయనగరంలలో పనులు సాగుతున్నాయి. 21న కర్నూలులో శిల్పారామానికి శంకుస్థాపన నిర్వహించనున్నాం. -
గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ధ్యేయం
నాగారం : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని ఈటూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాల్లో రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఈటూరు గ్రామంలో రూ.4.50లక్షలతో నిర్మించిన హెల్త్‌సబ్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో పీఆర్ డీఈఈ ప్రభు, ఏఈఈ శ్రీనివాస్, డీటీవో డాక్టర్ కోటా చలం, డాక్టర్ కిరణ్‌కుమార్, ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, సర్పంచ్‌లు చిల్లర చంద్రమౌళి, శీల స్వరూపకృష్ణమూర్తి, కల్లెట్లపల్లి శోభన్, గుండగాని అంబయ్య, పొదిల రమేష్‌గౌడ్, పానుగంటి నర్సింహారెడ్డి, కల్లెట్లపల్లి ఉప్పలయ్య పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసే పార్టీలోకి..
ఆసిఫాబాద్‌క్రైం : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే తమ పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో వాంకిడి మండలంలోని కనర్గాం గ్రామానికి చెందిన ప్రజలను ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు మెచ్చి పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వాపోయారు. గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు, రెబ్బన ఎంపీపీ సంజీవ్, ఎంపీటీసీ రవీందర్, నాయకులు గాదవేణి మల్లేశ్, సుదర్శన్‌గౌడ్, జాడి రేణుక బాయి, రాజు బాయి, నందు, కిరణ్, జీవన్ తదితరులున్నారు. -
ప్రజల కోసమే రాజకీయాల్లోకి..
కౌటాల : నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కారించేందుకే తాను రాజకీయాలోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే పీపీరావు తనయుడు, ప్రజా నాయకుడు పాల్వాయి హరిశ్‌బాబు స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని నాగేపల్లి, గిన్నెలహెట్టి, కౌటాల గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిన్నెలహెట్టి గ్రామంలోని హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామంలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు ఆయనకు తమ సమస్యలు తెలిపారు. సమస్యలు విన్న హరిశ్‌బాబు నాగేపల్లి, గిన్నెలహెట్టి గ్రామాల్లోని సమస్యల పరిష్కారించడానికి కృషి చేస్తాన్నాని మాటిచ్చారు. తాను అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాన్నని తెలిపారు. ఆనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆర్యోగ కేంద్రాన్ని సందర్శించిన ఆయ. అక్కడ అందిస్తున్న వైద్య సేవలను స్థానిక వైద్యుడు కృష్ణప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి పేదప్రజలు వస్తారిని, వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎల్ములే మల్లయ్య, చదువుల శ్రీనివాస్, దుర్గం మోతిరాం, బావుజీ, కుంచాల విజయ్, జ్యోతిరావు తదితరులు పాల్గొన్నారు. -
గాంధీజీ గ్రామ స్వరాజ్యం కేసీఆర్‌తోనే సాధ్యం
యాదగిరిగుట్ట : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. పాలనాపరంగా సులువుగా ఉంటుందని సీఎం కేసీఆర్ ఆలో చించి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 500జనాభా నుంచి మొదలై అంతకు ఎక్కువగా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. గిరిజన తండాలకు న్యాయం జరుగుతందన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా 39 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయని తెలిపా రు. 39 సంచాయతీల్లో వంద శాతం గిరిజనులు ఉన్న 12గ్రామాలను గిరిజన పంచాయతీలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కర్రె కమలమ్మ వెంకటయ్య, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, సర్పంచ్‌లు బూడిద స్వామి, కసావు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సీస కృష్ణ, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మిట్ట వెంకటయ్య, టిఆర్ఎస్వీ మండల, పట్టణ అధ్యక్షుడు గోపగాని ప్రసాద్‌గౌడ్, మిట్ట అనిల్‌గౌడ్, నాయకులు గునగంటి బాబురావుగౌడ్, బండపల్లి నరేష్‌గౌడ్, దావూద్ తదితరులున్నారు. -
మంచిర్యాలకు మంచి రోజులు
మంచిర్యాలటౌన్ : మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గాను రూ.237.64 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రజలు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో వివిధ పనులకోసం అవసరమైన నిధుల కోసం పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ క్రమంలో ఇటీవల శ్రీరాంపూర్‌కు విచ్చేసిన సీఎం తాను ప్రజల తరుపున కోరిన పలు డిమాండ్లను వెంటనే అంగీకరించి, నిధులను విడుదల చేస్తూ బుధవారం జీవో నంబర్ 170ని విడుదల చేశారని తెలిపారు. మంచిర్యాల గోదావరి నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మంచిర్యాల నుంచి బసంత్‌నగర్ వరకు 23 కిలోమీటర్లు తగ్గుతుందన్నారు. దీనివల్ల ఇక్కడి ప్రాంత ప్రజలకు దూరభారంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని చెప్పారు. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ థియేటర్ నుంచి హైటెక్‌సిటీ కాలనీ, హమాలివాడ మీదుగా తోళ్లవాగు వరకు గల బైపాస్ రహదారికి వెళ్లేందుకు హైటెక్‌సిటీ కాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌పై ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.77.64 కోట్లు కేటాయించారని తెలిపారు. పట్టణంలోని ఐబీ నుంచి బొక్కలగుట్ట (క్యాతన్‌పల్లి) వరకు ఏడు కిలోమీటర్లు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.35 కోట్లు విడుదల చేయడంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్‌రావు చిత్రపటాలకు టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్‌చైర్మన్ నల్ల శంకర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ అత్తి సరోజ, మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి వెంకటేశ్వర్రావు, మాజీ చైర్మన్ పెంట రాజయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కార్యదర్శి పెండ్లి అంజయ్య, యూత్ అధ్యక్షుడు రాకేశ్, బీసీ సెల్ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్, నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రతి హామీని అమలుపర్చిన ఘనత టీఆర్ఎస్దే
పెద్దవూర : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలుపర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపీపీ వస్తపురి మల్లిక, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎంసీ కోటిరెడ్డిలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రామాలయం పక్క వీధిలో రూ.5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను, రైతు పెట్టుబడికి ఎకరాకు రూ.4వేలు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ నిర్విరామంగా కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని తనాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ కూతాటి భానుశ్రీదేశ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి, మేరెడ్డి జైపాల్‌రెడ్డి, బోయ నరేందర్‌రెడ్డి, నడ్డి లింగయ్యయాదవ్, ఏఎంసీ డైరెక్టర్ నడ్డి లక్ష్మయ్యయాదవ్, పులిమాల కృష్ణారావు, వస్తపురి నర్సింహ, కర్నాటి ప్రతాప్‌రెడ్డి, డైమండ్ బ్రదర్స్, ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్రావు, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి : గ్రామాల అభివృద్ధిలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 12.69 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరైనట్లు టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రంగుండ్ల తండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన రూ. 5 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ అల్లి నాగమణిపెద్దిరాజు యాదవ్, గ్రామ సర్పంచ్ ఆంగోతు భగవాన్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంగోతు సూర్యభాషా నాయక్, ఎంపీటీసీ బుర్రి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ చవ్వా బ్రహ్మనందరెడ్డి, నిడమనూరు సింగిల్‌విండో వైస్ చైర్మన్ కేతావత్ భిక్షా నాయక్, నాగేండ్ల కృష్ణారెడ్డి, ఆంగోతు ఫకీర, జవహర్‌నాయక్, చల్ల సోమశేఖర్, దుబ్బ శివాజీ, చింతలచెరువు శ్రీను, బాబురావు నాయక్, ఆంగోతు మంగ్తా పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతికి కృషి
సూర్యాపేట : పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామాత్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన బడుగుల లింగయ్యయాదవ్ తొలిసారిగా సూర్యాపేటకు రావడంతో ఆయన ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. పక్క రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు అంటేనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ఆర్థికంగా భయపడే వారినే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారని చెప్పారు. ఇంటి పేరులోనే బడుగుల ఉన్న బడుగు బలహీన వర్గాలకు టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యం కల్పిస్తుందనడానికి బడుగుల లింగయ్యయాదవ్ ఎంపికే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. మరో అభ్యర్థి బండా ప్రకాష్ కూడా బడుగు బలహీన వర్గానికి చెందిన అది ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అన్నారు. కేసీ ఆర్కు నీడలా ఉండే జోగినేపల్లి సంతో ష్‌కుమార్ మూడో అభ్యర్థని చెప్పారు. రాజ్యసభకు ఈ తరహా అభ్యర్థులను ఎంపిక చేసి రాజకీయాల్లో పారదర్శకతను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలోనే ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో 51 శాతం బడుగు, బలహీన , హరిజన, గిరిజన మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లను రూపొందించుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివా స్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ చైర్మన్ వైవి, నాయకులు గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, వర్ధెల్లి శ్రీహరి, వట్టె జానయ్యయాదవ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, చనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, బైరు దుర్గయ్యగౌడ్, కక్కిరేణి నాగయ్యగౌడ్, జీడి భిక్షం, బైరబోయిన శ్రీనివాస్, గోదల రంగారెడ్డి, పుట్టా కిషోర్‌నాయు డు, రమాకిరణ్‌గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఇచ్చోడ(బోథ్) : టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని కోకస్‌మన్నూర్‌లో రూ.2 లక్షలతో చేపడుతున్న బుద్ధ విహార్ అదనపు గదుల నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కోకస్‌మన్నూర్‌లో బుద్ధవిహార్ అదనపు గదులకు రూ.2లక్షలు, మున్నూర్‌కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం రూ.5లక్షలు నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కృష్ణకుమార్, కృష్ణారెడ్డి, జ్ఞానేశ్వర్, బజార్హత్నూర్ ఎంపీటీసీ నారాయణ, బజార్హత్నూర్ మండల కన్వీనర్ నాణం రమణ, చిలుకూరి భూమన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ హయాంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి
డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం ఖమ్మం: భారత మాజీ ప్రధాని,రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఐతం సత్యం రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మయూరి సెంటర్లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలు వేశారు. ఈ సందర్భంగా ఐతం సత్యం మాట్లాడుతూ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల వైపు పయణించేలా దారులు వేసిన మహా నేత రాజీవ్‌గాంధీ అన్నారు.ఆయన కృషి ఫలితంగానే నేడు దేశం ప్రపంచ దేశాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ పడుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కొత్తా సీతారాములు, పుల్లిపాటి వెంకటయ్య, వీవీ అప్పారావు, బండి మణి, గాదెల ఝాన్సీ, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, తాజొద్దిన్, ఫజల్, బాలాజీరావునాయక్ పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఖమ్మం నగరంలో సద్భావనా ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ప్రదీప్, క్రాంతికుమార్, అబ్దుల్ అహద్, సతీష్, సాయి, ఖలీక్, నజర్, పాలుక్ పాల్గొన్నారు. త్రీటౌన్ ఏరియాలో.. ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ఏరియాలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి ఏరియా యుత్ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యువతకు రాజీవ్‌గాంధీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు మ«ధు,బాలగంగాధర్, కార్తీక్, వెంకటేష్, ఉపేందర్, జమీల్, జావిద్ పాల్గొన్నారు. -
మహిళా భాగస్వామ్యంతోనే దేశ ప్రగతి
సాగర్‌నగర్ : అమెరికా వంటి అభివద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీపడి ఆర్థిక ప్రగతి సాధించాలంటే.. దేశంలో మహిళలను అన్ని రంగాల్లో పొత్రహించడం ద్వారా మాత్రమే సాధ్యమని మహిళ పారిశ్రామికవేత్త, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ దక్షిణ ప్రాంత డిప్యూటీ ఛైర్‌ఉమెన్ వనితా దాట్ల పేర్కొన్నారు. గీతం విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఇటీవల జరిగిన కొన్ని జాతీయస్థాయి అధ్యయనాల్లో దేశంలోని మహిళల్లో కేవలం ఆరుశాతం మంది మాత్రమే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. నిజానికి దేశంలోని అక్షరాస్యత గల మహిళల సంఖ్యను తీసుకుంటే మరో 48శాతం మంది మహిళలు అవకాశాలు పొందటానికి అర్హులుగా తేలిందన్నారు. మహిళల ఆలోచనా విధానం, వివిధ అంశాలపై పారదర్శకతతో వ్యవహరించడం వల్ల మంచి పారిశ్రామికవేత్తలుగా రాణించగలిగే సత్తా ఉంటుందన్నారు. దేశ స్థూల జాతీయోత్పిత్తిలో మహిళలు పది శాతం మేరకు సహకరిస్తే ఆర్థిక రంగంలో 8 శాతం వద్ధి త్వరితంగా సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కె. మంజుశ్రీనాయుడు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.