గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి  | The Government is Committed to The Development of Rural Areas | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి 

Published Mon, Mar 26 2018 7:12 AM | Last Updated on Mon, Mar 26 2018 7:12 AM

The Government is Committed to The Development of Rural Areas - Sakshi

అదనపు గదులకు భూమిపూజ చేస్తున్న ఎంపీ గోడం నగేశ్‌

ఇచ్చోడ(బోథ్‌) : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. మండలంలోని కోకస్‌మన్నూర్‌లో రూ.2 లక్షలతో చేపడుతున్న బుద్ధ విహార్‌ అదనపు గదుల నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కోకస్‌మన్నూర్‌లో బుద్ధవిహార్‌ అదనపు గదులకు రూ.2లక్షలు, మున్నూర్‌కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం రూ.5లక్షలు నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కృష్ణకుమార్, కృష్ణారెడ్డి, జ్ఞానేశ్వర్, బజార్‌హత్నూర్‌ ఎంపీటీసీ నారాయణ, బజార్‌హత్నూర్‌ మండల కన్వీనర్‌ నాణం రమణ, చిలుకూరి భూమన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement