విలేకరులతో మాట్లాడుతున్న విప్ సునీత
యాదగిరిగుట్ట : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. పాలనాపరంగా సులువుగా ఉంటుందని సీఎం కేసీఆర్ ఆలో చించి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 500జనాభా నుంచి మొదలై అంతకు ఎక్కువగా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు.
గిరిజన తండాలకు న్యాయం జరుగుతందన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా 39 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయని తెలిపా రు. 39 సంచాయతీల్లో వంద శాతం గిరిజనులు ఉన్న 12గ్రామాలను గిరిజన పంచాయతీలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కర్రె కమలమ్మ వెంకటయ్య, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, సర్పంచ్‌లు బూడిద స్వామి, కసావు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సీస కృష్ణ, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మిట్ట వెంకటయ్య, టిఆర్‌ఎస్వీ మండల, పట్టణ అధ్యక్షుడు గోపగాని ప్రసాద్‌గౌడ్, మిట్ట అనిల్‌గౌడ్, నాయకులు గునగంటి బాబురావుగౌడ్, బండపల్లి నరేష్‌గౌడ్, దావూద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment