గ్రామాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయం | Trs Govt Developed Main Villages | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే్ద టీఆర్‌ఎస్‌ ధ్యేయం

Published Sun, Apr 8 2018 7:47 AM | Last Updated on Sun, Apr 8 2018 8:00 AM

Trs Govt Developed Main Villages - Sakshi

ఈటూరులో శంకుస్థాపన  చేస్తున్న ఎమ్మెల్యే కిశోర్‌

నాగారం : గ్రామాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని ఈటూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాల్లో రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఈటూరు గ్రామంలో రూ.4.50లక్షలతో నిర్మించిన హెల్త్‌సబ్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు.  కార్యక్రమంలో పీఆర్‌ డీఈఈ ప్రభు, ఏఈఈ శ్రీనివాస్, డీటీవో డాక్టర్‌ కోటా చలం, డాక్టర్‌ కిరణ్‌కుమార్, ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, సర్పంచ్‌లు చిల్లర చంద్రమౌళి, శీల స్వరూపకృష్ణమూర్తి, కల్లెట్లపల్లి శోభన్, గుండగాని అంబయ్య, పొదిల రమేష్‌గౌడ్,  పానుగంటి నర్సింహారెడ్డి, కల్లెట్లపల్లి ఉప్పలయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement