
13 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 13 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు వై.కె.రెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని, ఇది 13 కల్లా బలపడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ అల్పపీడనం వల్ల ఉత్తర తెలంగాణలో అధికంగా వర్షాలు కురుస్తాయని వివరించారు.