ఈ–లెర్నింగ్‌లో తెలంగాణ నంబర్‌ వన్‌ | Telangana Is Top In E Learning | Sakshi
Sakshi News home page

ఈ–లెర్నింగ్‌లో తెలంగాణ నంబర్‌ వన్‌

Published Tue, Mar 20 2018 2:31 AM | Last Updated on Tue, Mar 20 2018 2:31 AM

Telangana Is Top In E Learning - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఈ లెర్నింగ్‌ శిక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుంద’ని ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్‌ తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ) సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోయల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ లెర్నింగ్‌ శిక్షణలో తెలంగాణ రాష్ట్రం మిగతా 28 రాష్ట్రాల కంటే ముందుండే విధంగా ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 16,510 మందికి శిక్షణ ఇచ్చాం. మరో 60 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు సమయ పాలన , నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌పై శిక్షణ ఇస్తూ, బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు అయ్యేలా తయారు చేస్తున్నాం’అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement