- మేడారం టెండర్లలో సీన్ రిపీట్
- ఐటీడీఏ కార్యాలయం సాక్షిగా
- డబ్బు పంపిణీ లెస్‌గా కోట్ చేసే
- కాంట్రాక్టర్లకు బెదిరింపులు
ఏటూరునాగారం : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ద్వారా చేపట్టిన 12 అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు రింగ్ అయ్యూరు. రూ.1.01 కోట్ల నిధులతో చేపట్టిన టెండ ర్లలో సీన్ రిపీట్ అయింది. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సోమవారం కాంట్రాక్టర్లు రింగ్ కావడానికి ఒక షెడ్యూల్‌కు రూ. 5 వేల చొప్పున కొనుగోలు చేశారు. లెస్ వేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తూ షెడ్యూళ్లను రద్దు చేయించారు. గతనెల 30న జరిగిన టెండర్ల రింగ్ ప్రక్రియే ఇప్పుడు కూడా యథేచ్చగా సాగింది. గిరిజన సంక్షేమ శాఖకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ పెట్టే అవకాశం ఉన్నా.. ఓపెన్ టెండర్లకు అధికారులు మొగ్గు చూపడం తో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు లెస్‌కు టెండర్ వేసే వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఐటీడీఏ కార్యాలయం సమీపంలోనే కాంట్రాక్టర్ల వద్ద ఉన్న షెడ్యూళ్ల ఫారాలను డబ్బులు ఎరచూపి తీసుకోవడం గమనార్హం.
కలెక్టర్, పీఓ ఆదేశాలు బేఖాతర్..
గిరిజన సంక్షేమ శాఖ టెండర్లలో ఎలాంటి అక్రమాలు, అవినీతి లేకుండా పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కరుణ, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ ఆదేశాలను ఇంజనీరింగ్ అధికారులు బుట్టదాఖలు చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు కాకముందే ఎలాంటి అక్రమాలు జరిగినా సస్పెం డ్ చేస్తామని పీఓ ఇంజనీరింగ్ కార్యాలయం సిబ్బందిని హెచ్చరించినా.. అదే తంతు జరిగిం ది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా డబ్బు పంపిణీకి తెగించారు. ఇలా సిండికేట్ అయిన పనులకు తక్కువ లెస్‌గా నమోదు కాగా, సిండికేటు కాని పనులకు సుమారు 28 శాతం లెస్‌కు పోవడం గమనార్హం.
104 టెండర్లు దాఖలు..
ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చేపట్టబోయే 12 అభివృద్ధి పనులకు సోమవారం టెండర్లను ఓపెన్ చేశారు. 104 టెండర్లు దాఖలు అయ్యాయని డీఈఈ మల్లయ్య తెలిపారు. ఇం దులో 96 టెండర్లను ఓపెన్ చేశామన్నారు. అలాగే వై. రవి అనే వ్యక్తి 9 టెండర్లను బాక్స్‌లో వేసినప్పుడు అతడి లెటర్ ప్యాడ్‌పై ఈ టెండర్లు ఓపెన్ చేయవద్దని రాసిన కాగితం లభించడంతో ఆ టెండర్లను ఓపెన్ చేయలేదన్నారు. ఈఈ ఆదేశాల మేరకు వాటిని మంగళవారం ఓపెన్ చేస్తామని చెప్పారు. అయితే లెటర్ ప్యాడ్ అసలైనది కాదని, కేవలం జిరాక్స్ పేపర్‌పై స్థానిక కాంట్రాక్టర్లు సంతకం చేసి టెండర్ బ్యాక్స్‌లో వేశారని బాపిరెడ్డి అనే వ్యక్తి డీఈఈకి వివరించారు. దీం తో ఆ తొమ్మిది టెండర్ల ప్రక్రియ వాయిదా పడిం ది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజేం దర్, ఏటీఓలు ప్రభుదాస్, శ్రీనివాస్, జేటీఓ ముత్తయ్య పాల్గొన్నారు.
టెండరింగ్!
Published Tue, Dec 15 2015 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement
Advertisement