శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత
Published Mon, Sep 1 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్ట్స్ కాలేజి ప్రిన్స్ పాల్ ను తొలగించాలని, హాస్టల్ ను యూనివర్సిటీ అధికారులే నిర్వహించాలనే డిమాండ్ తో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్ధుల ఆందోళనతో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు భారీగా మోహరించారు.
ఈ ఘటనలో ఎంబీఏ విద్యార్ధిని సృహతప్పి పడిపోయింది. వెంటనే విద్యార్ధిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విద్యార్ధులతో పోలీసులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు.
Advertisement
Advertisement