
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
పాల్వంచ : ప్రేమించిన యువకుడు అందరి ఎదుట అందరి ఎదుట ఒప్పుకోవడం లేదని మనోవేదనకు గురైన ఓ పదో తరగతి విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో బుధవారం జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని సోనియా నగర్‌కు చెందిన గుగ్గిళ్ల వెంకటాచారి, రోజా కూతురు మాధురి(15) అభ్యుదయ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నవభారత్ గాంధీనగర్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ ఉపేందర్‌తో పరిచయం కావడంతో చనువుగా ఉంటున్నారు. దీంతో ఉపేందర్ తమ కూతురు వెంట పడుతున్నాడని కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఇద్దరిని మందలించారు. సోనియానగర్‌లోనే ఉంటే మాధురి చదువు ముందుకు సాగదని భావించి గత 15 రోజుల నుండి తండ్రి వెంకటాచారి వికలాంగుల కాలనీలోని బావమరిది రాజా చారి ఇంటి వద్ద ఉంచి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన మాధురి ఇంట్లో ఎవరు లేని సమయంలో బుధవారం సాయంత్రం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గుర్తించిన రాజాచారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకున్న చోట సూసైడ్ నోట్ రాసి ఉంచింది. ఉపేందర్ అందరి ముందుకు వచ్చి ఒప్పుకోవడం లేదనే నెపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అమ్మనాన్న తమ్ముడు సంతు అంటే తనకు ఎంతో ఇష్టమని, తమ్ముడిని బాగా చదివించాలని నోట్‌లో కోరింది. సంఘటన స్థలాన్ని పట్టణ అదనపు ఎస్సై కృష్ణయ్య సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.