పాఠ్యపుస్తకం..ప్రియం
కోదాడటౌన్, న్యూస్‌లైన్, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు విపరీతంగా పెరిగాయి. గత ఏడాది కంటే ఏకంగా 60 నుంచి 70 శాతం పెంచారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించేందుకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలను ఆయా మండల కేంద్రాల్లోకి చేరవేశారు. కానీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను మాత్రం ఇప్పటి వరకు మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. సోమవారం నుంచి ఓ డిస్ట్రిబ్యూటర్ కొన్ని తరగతుల పుస్తకాలను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.
ఇదెక్కడి మార్కెటింగ్?
ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈ పుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు. ప్రైవేట్ విద్యార్థులకు పుస్తకాలను బహిరంగ మార్కెట్ ద్వారా అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు సంస్థలకు పంపిణీ బాధ్యతలు అప్పగించారు. వీరిలో జీటీఓ సేల్స్ అనే డిస్ట్రిబ్యూటర్ 1, 2, 3, 7, 8, 9వ తరగతి పుస్తకాలను పంపిణీ చే స్తుండగా, బెల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ 4, 5, 6, 10వ తరగతి పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వీరిద్దరు ఒకేసారి పుస్తకాలను పంపిణీ చేయడం లేదు.
జీటీఓ సేల్స్ కంపెనీ పుస్తకాల పంపిణీ చేస్తుండగా, బెల్ కంపెనీ మాత్రం రెండు మూడు రోజుల్లో పంపిణీ మెదలుపెడతామని చెబుతున్నట్టు పలువురు పుస్తక విక్రేతలు అంటున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టూ తిరగాల్సి వస్తుం దని, అన్ని తరగతుల పుస్తకాలు కావాలనుకుంటే రెండుచోట్లకు పరుగులు పెట్టాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
ఇంటర్ పుస్తకాలదీ.. అదే దారి
మరికొద్ది రోజుల్లో ఇంటర్ తరగతుల ప్రా రంభం కానుండగా ఇప్పటివరకు మార్కెట్‌లోకి పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. గత ఏడాది ఇంటర్ పుస్తకాల ధరలు అధికంగా ఉన్నాయనే విమర్శలు రా వడంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ధర లు తగ్గించనున్నట్లు అధికారులు ప్రకటిం చారు. తెలుగు ఆకాడమీ అధికారులు ప్రతి పాదనలు పంపినప్పటికీ అటునుంచి సమాధానం రాకపోవడంతో ధరల విషయం తేలక పాఠ్యపుస్తకాలను మార్కెట్‌లోకి విడుదల చేయలేదని సమాచారం.
తాజా గా పాత ధరలతోనే మరో 15రోజుల్లో పాఠ్యపుస్తకాలు మార్కెట్‌లోకి విడుదల చేస్తామని, ధరల తగ్గింపు ఈ విద్యాసంవత్సరానికి లేనట్టేనని తె లుగు అకాడమి అధికారులు చావుకబురు చల్ల గా చెబుతున్నారు. మరో 15రోజులపాటు ఇం టర్ పుస్తకాలు మార్కెట్‌లోకి రాకపోతే ఇబ్బం దులు తప్పవని విద్యావేత్తలు అంటున్నారు.