government textbooks
-
TG: ‘ముందు మాట’ వివాదం.. ఇద్దరు అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్ట్స్ బుక్స్‌లో వచ్చిన తప్పులను సీరియస్‌గా తీసుకున్న సర్కార్.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ముందు మాటను మార్చి విద్యార్థులకు తిరిగి ఇవ్వనున్నారు. -
ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతి విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను డీఈవోల ద్వారా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు కూడా సమాచారం అందించామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ నెల 12లోపు ప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. ఆ తేదీలోపు చేరని వారు అడ్మిషన్లు కోల్పోతారన్నారు. విద్యార్థుల జాబితాను cse.ap.gov.in/DSE/లో ఉంచామన్నారు. ఈ విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
పాఠ్యపుస్తకాల్లో స్వామీజీలు, బాబాల చరిత్ర
గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్వాశ్రమంలో గోరక్నాథ్ మఠానికి ముఖ్య అధిపతిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందుకే కాబోలు ఆ మూలాలను మర్చిపోలేక ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక మీదట ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో చరిత్ర విస్మరించిన బాబాలు, స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన పాఠాలను కూడా చేర్చాలని యూపీ రాష్ట్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి యూపీ విద్యాశాఖ అధికారి భూపేంద్ర నారాయణ్ సింగ్ ‘ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఏడాది పంచే పాఠ్యపుస్తకాలలో ప్రముఖ బాబాలు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చేర్చనున్నాము. వీరిలో బాబా గోరఖ్‌నాథ్, బాబా గంభీర్‌నాథ్, స్వాతంత్ర్య సమరయోధుడు బంధు సింగ్, రాణి అవంతి బాయితో పాటు 12వ శతాబ్దికి చెందిన పోరాట యోధులు అల్లా, ఉదల్ గురించి కూడా చేర్చను’న్నట్లు తెలిపారు. వీరంతా నాథ్ శాఖకు చెందిన మహనీయులని, కానీ గత పాలకులు వీరిని నిర్లక్ష్యం చేసారన్నారు. నేటి తరానికి వీరి గురించి తెలియాలనే ఉద్దేశంతో వీరి జీవిత చరిత్రలను ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో చేరుస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ ఏడాది పంచే పుస్తకాలు ఆకర్షణీయమైన రంగుల్లో, క్యూఆర్ కోడ్‌తో రానున్నాయన్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత పాఠాలు డిజిటల్ ఫార్మాట్లో మొబైల్ ఫోన్లలో కనిపిస్తాయని తెలిపారు. -
పాఠ్యపుస్తకం..ప్రియం
కోదాడటౌన్, న్యూస్‌లైన్, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు విపరీతంగా పెరిగాయి. గత ఏడాది కంటే ఏకంగా 60 నుంచి 70 శాతం పెంచారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించేందుకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలను ఆయా మండల కేంద్రాల్లోకి చేరవేశారు. కానీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను మాత్రం ఇప్పటి వరకు మార్కెట్లోకి విడుదల చేయలేదు. సోమవారం నుంచి ఓ డిస్ట్రిబ్యూటర్ కొన్ని తరగతుల పుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇదెక్కడి మార్కెటింగ్? ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈ పుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు. ప్రైవేట్ విద్యార్థులకు పుస్తకాలను బహిరంగ మార్కెట్ ద్వారా అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు సంస్థలకు పంపిణీ బాధ్యతలు అప్పగించారు. వీరిలో జీటీఓ సేల్స్ అనే డిస్ట్రిబ్యూటర్ 1, 2, 3, 7, 8, 9వ తరగతి పుస్తకాలను పంపిణీ చే స్తుండగా, బెల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ 4, 5, 6, 10వ తరగతి పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వీరిద్దరు ఒకేసారి పుస్తకాలను పంపిణీ చేయడం లేదు. జీటీఓ సేల్స్ కంపెనీ పుస్తకాల పంపిణీ చేస్తుండగా, బెల్ కంపెనీ మాత్రం రెండు మూడు రోజుల్లో పంపిణీ మెదలుపెడతామని చెబుతున్నట్టు పలువురు పుస్తక విక్రేతలు అంటున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టూ తిరగాల్సి వస్తుం దని, అన్ని తరగతుల పుస్తకాలు కావాలనుకుంటే రెండుచోట్లకు పరుగులు పెట్టాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇంటర్ పుస్తకాలదీ.. అదే దారి మరికొద్ది రోజుల్లో ఇంటర్ తరగతుల ప్రా రంభం కానుండగా ఇప్పటివరకు మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. గత ఏడాది ఇంటర్ పుస్తకాల ధరలు అధికంగా ఉన్నాయనే విమర్శలు రా వడంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ధర లు తగ్గించనున్నట్లు అధికారులు ప్రకటిం చారు. తెలుగు ఆకాడమీ అధికారులు ప్రతి పాదనలు పంపినప్పటికీ అటునుంచి సమాధానం రాకపోవడంతో ధరల విషయం తేలక పాఠ్యపుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేయలేదని సమాచారం. తాజా గా పాత ధరలతోనే మరో 15రోజుల్లో పాఠ్యపుస్తకాలు మార్కెట్లోకి విడుదల చేస్తామని, ధరల తగ్గింపు ఈ విద్యాసంవత్సరానికి లేనట్టేనని తె లుగు అకాడమి అధికారులు చావుకబురు చల్ల గా చెబుతున్నారు. మరో 15రోజులపాటు ఇం టర్ పుస్తకాలు మార్కెట్లోకి రాకపోతే ఇబ్బం దులు తప్పవని విద్యావేత్తలు అంటున్నారు. -
ముందస్తుగా పాఠ్య పుస్తకాలు
మెదక్, న్యూస్‌లైన్: గడిచిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి విద్యాధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. వేసవి సెలవుల ప్రారంభం నాటికే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి జిల్లాకు మొత్తం 20,72,623 పుస్తకాలు అవసరం కాగా ప్రస్తుతం మెదక్ పట్టణానికి 5,36,652 పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయి. నిల్వ ఉన్న 2,44,096 కలిపి బుధవారం నాటికి మొత్తం 7,80,748 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కాగా పదో తరగతికి ఈసారి సిలబస్ మారినప్పటికీ ఏప్రిల్ 23 నాటికే ప్రస్తుతం 9వ తరగతిలో ఉన్న ప్రతి విద్యార్థికి అన్ని టైటిల్స్ అందజేయనున్నారు. శుక్రవారం నుంచి మెదక్ కేంద్రం నుంచి నిర్ణీత షెడ్యూల్‌కనుగుణంగా పంపిణీ చేయనున్నట్లు పుస్తక నిల్వ కేంద్ర ఇన్చార్జి లక్ష్మీనర్సింహగౌడ్ తెలిపారు. పంపిణీకి చర్యలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విద్యార్థులకు 1994వ సంవత్సరం నుంచి అన్ని పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కాగా గతంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల వరకూ పుస్తకాల పంపిణీ జరిగేది. ఈ జాప్యాన్ని నివారించడానికి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాణీమోహన్ 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలో 6.50 కోట్ల పుస్తకాల ముద్రణ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత జనవరి 3వ వారం నుంచి జిల్లాల గోదాములకు పుస్తకాల ను విడతల వారీగా తరలిస్తున్నారు. అలాగే ఈ నెల 14 నుంచి మండల స్థాయి గోదాములకు, మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు పంపిణీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 9వ తరగతిలో ఉన్న విద్యార్థికి వచ్చే విద్యాసంవత్సరం పదో తరగతికి సంబంధించి పుస్తకాలను ఏప్రిల్ 23 వరకు అందజేస్తారు. విద్యార్థులకు కావాల్సిన టైటిల్స్ ఇవే.. 1వ తరగతికి ఆరు టైటిల్స్, 92,527 పుస్తకాలు అవసరం. రెండో తరగతికి 6 టైటిల్స్, 89,848 పుస్తకాలు, 3వ తరగతికి 10 టైటిల్స్ 1,33,914 పుస్తకాలు, 4వ తరగతికి 9 టైటిల్స్ 1,45,179 పుస్తకాలు. 5వ తరగతికి 10 టైటిల్స్, 1,72,076 పుస్తకాలు, 6వ తరగతికి 15 టైటిల్స్ (ఆంగ్లం, తెలుగు మీడియం) 2,39,919 పుస్తకాలు, 7వ తరగతికి 15 టైటిల్స్, 2,30, 138 పుస్తకాలు, 8వ తగరతికి 18 టైటిల్స్, 2,93. 575 పుస్తకాలు, 9వ తరగతికి 18 టైటిల్స్ 3.30 లక్షల పుస్తకాలు, పదో తరగతికి 18 టైటిల్స్ 3,45,075ల పుస్తకాలు అవసరమవుతాయి.