కార్మిక సంఘాలతో చర్చించండి: సీఎం కేసీఆర్
హైదరాబాద్: .ఆర్టీసీ కార్మిక సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ తో మంత్రులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. తొలుత ఉపసంఘ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేసీఆర్.. కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరిపి సమంజసమైన ప్రతిపాదనలని ఇవ్వాలని కోరారు.
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీకి నాయిని నేతృత్వం వహించనున్నారు. ఇందులో ఈటెల, మహేందర్ రెడ్డిలు సభ్యులుగా ఉండనున్నారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కూడా సీఎం చర్చించారు. ఒకవేళ చర్చలు విఫలమైతే తదుపరి చర్యలపై ఏమిటనేది ప్రధానంగా అధికారులతో చర్చించారు.