
ప్రియుడు మోసం చేశాడని
యువతి ఆత్మహత్యాయత్నం
ఏటూరునాగారం : ప్రేమించిన వ్యక్తే.. ఒప్పుకున్న కట్నం మొత్తం కావాలని, లే దంటే పెళ్లి చేసుకోనని మొండికేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో గురువా రం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు బాధితురాలు మమత తల్లిదండ్రులు సా రంపెల్లి శ్రీనివాసరెడ్డి, ఉమ కథనం ప్రకా రం ఇలా ఉన్నాయి. మమత బీఈడీ చది వేందుకు చిత్తూరు జిల్లా తిరుపతికి 2010 లో వెళ్లింది. వీరికి సమీప బంధువైన కొత్తగూడ మండల అలుగుబెల్లికి చెందిన యా కూబ్‌రెడ్డి కుమారుడు వెంకటరమణారెడ్డి తిరుపతిలో ఫిజియోథెరఫీ వైద్యుడిగా పని చేస్తున్నారు. బంధుత్వం ఉండడంతో నా లుగేళ్లుగా వీరు ప్రేమించుకుంటుండగా.. పెద్దలు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబ ర్‌లో రూ. 6 ల క్షల కట్నం మాట్లాడుకున్న మమత తల్లిదండ్రులు రూ.లక్ష వరపూజ కింద ఇచ్చా రు.
అయితే, మిగతా రూ.5 లక్షలు ఒకేసారి ఇస్తేనే మమతను పెళ్లి చేసుకుంటానని మొండికేశాడు. ఈ విషయమై ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో మమత తల్లిదండ్రులు ఫిర్యాదుచేసి, పెద్దలు మాట్లాడుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో మ నస్తాపానికి గురైన ఆమె గురువారం చిన్నబోయినపల్లిలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి, ఆపై ఎంజీఎంకు తరలించారు.