వాటర్‌గ్రిడ్‌కు కేంద్ర సహకారం కోరాం
ఢిల్లీలో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నల్లా నీళ్ల (వాటర్‌గ్రిడ్) పథకానికి, రెండు పడకల ఇళ్ల పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. హడ్కో 45వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్‌తో కలసి ఆయన పాల్గొన్నారు.
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అభినందిస్తూ మౌలిక వసతుల విభాగంలో రాష్ట్రానికి వచ్చిన అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చేతులమీదుగా కేటీఆర్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నేపాల్ భూకంపంలో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అవరసమైతే ప్రత్యేకంగా అధికారుల బృందాలను పంపి వారిని క్షేమంగా తీసుకువస్తామని స్పష్టం చేశారు.