వైద్య సేవలు అందించే ఓ డాక్టర్ డెంగ్యూతో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్‌మెయినుద్దీన్ (27) స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యసేవలు అందిస్తున్నాడు.
పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. కాగా.. భార్య ఎనిమిది నెలల గర్భవతి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.