కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ (సీసీఐ) పత్తి కొనుగోళ్లు బంద్ పెట్టింది. సోమవారం నుంచి ఆయా మార్కెట్ యూర్డుల్లోని కేంద్రాలను మూసివేసింది. దీంతో పత్తి రైతులను దోచుకునేందుకు ఎదురుచూస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు కలిసి వచ్చింది. సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోరుున మొదటిరోజే పత్తి ధర గణనీయంగా పడిపోరుుంది. జిల్లాలోనే పెద్దదైన జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర రూ.3500-3700 మాత్రమే పలికింది. 24 గంటల వ్యవధిలోనే రూ.200 వరకు పడిపోయింది.
జమ్మికుంట రూరల్ : జిల్లాలో జమ్మికుంట, పెద్దపల్లి మార్కెట్ యూర్డుల్లో గత డిసెంబర్ నుంచి సీసీఐ పత్తికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులు కొంత ప్రయోజనం పొందారు. ఇంకా పత్తి అమ్మకాలు పూర్తికాకుండానే ఉన్నఫళంగా సీసీఐ కొనుగోళ్లు బంద్ చేయడంతో రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకునే పరిస్థితి దాపురించింది. ఈ నాలుగు నెలల కాలంలోనూ సీసీఐ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున బినామీ వ్యాపారం నడిపినట్టు ఆరోపణలు వెల్లువెత్తారుు. సంవత్సరాంతం ఆడిటింగ్ పేరిట పత్తి కొనుగోళ్లకు స్వస్తి చెప్పడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా మారిందనే అనుమానాలు వాదనలు వినిపిస్తున్నారుు.
ఒక్కరోజులోనే ఎంత తేడా..?
సోమవారం జమ్మికుంట మార్కెట్‌లో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలిస్తే వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నారనేది స్పష్టమవుతోంది. గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.4060గా నిర్ణయించినప్పటికీ మచ్చుకు కొంత చెల్లించి మిగతా మొత్తాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోచుకున్నారనే ఆరోపణలు వినిపించారుు. సీపీఐ పత్తిని కొనుగోలు చేసిన సందర్భంలో బస్తాల్లో వచ్చిన పత్తికి ప్రైవేట్ ట్రేడర్లు రూ.3700-3900 వరకు చెల్లించారు.
సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో అదే వ్యాపారులు కేవలం రూ.3500-3700 వరకు చెల్లిస్తూ సోమవారం కొనుగోళ్లు చేపట్టారు. మార్కెట్‌కు 401 క్వింటాళ్ల లూజ్ పత్తి రాగా, 284 క్వింటాళ్ల పత్తి బస్తాలు వచ్చాయి. లూజ్ పత్తికి క్వింటాల్‌కు రూ.4060 ధరగా నిర్ణయించి అతి కొద్దిగా మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా పత్తికి తేమ, నాణ్యత పేరుతో తక్కువ ధర చెల్లించారు. గతవారం రోజుల్లో రోజుకు సుమారు 2500 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రాగా సోమవారం 686 క్వింటాళ్లు మాత్రమే అమ్మకానికి వచ్చింది.
ఏప్రిల్‌లో తెరుచుకుంటాయూ?
జమ్మికుంట మార్కెట్‌లో సీసీఐ ఇప్పటివరకు 2,73,132 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు 92,933 క్వింటాళ్లు కొన్నారు. అయితే ఏప్రిల్‌లో సీసీఐకి అమ్మితే ధర అధికంగా వస్తుందని ఆశపడ్డ రైతులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. సంవత్సరాంతపు ఆడిటింగ్ పూర్తయిన తరువాత ఏప్రిల్ మొదటి వారంలో సీసీఐ తిరిగి పత్తిని కొనుగోలు చే స్తుందని ప్రచారం జరగడంతో రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి రైతుల ఇళ్లలో వేల క్వింటాళ్ల పత్తి నిల్వలున్నారుు. ఆలస్యంగా అమ్మితే మంచి ధర వస్తుందని ఆశించగా, ఇప్పుడు ఆసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని అన్నదాతలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పత్తి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
ఒక్క రోజులోనే ఎంత తేడా..?
జమ్మికుంటలో వ్యాపారులు చెల్లించిన ధరలు
మొన్న రూ.37003900
నిన్న రూ.35003700
జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు (క్వింటాళ్లు)
సీసీఐ కేంద్రంలో 2,73,132
వ్యాపారులు 92,933
ఇక దోచుకున్నంత..!
Published Tue, Mar 24 2015 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM
Advertisement
Advertisement