మోర్తాడ్ : గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాటర్ వర్క్స్, వీధి దీపాల బిల్లులను తాము చెల్లించేది లేదంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలపై భారం పడకుండా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించింది.
ఆయన మరణానంతరం గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు ఈ విషయమై దాటవేత ధోరణిని అవలంబిం చగా.. తాజాగా తెలంగాణ సర్కారు విద్యుత్ బిల్లుల భారాన్ని పంచాయతీలపైనే మోపడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీలకు పన్నుల ద్వారా లభించే ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో వీధి దీపాలు, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన విద్యుత్ బిల్లులను తాము చెల్లించడం కష్టం అవుతుందని పేర్కొంటున్నారు.
జిల్లాలో 718 గ్రామ పంచాయతీలకు నోటిఫైడ్ పంచాయతీలు 72 ఉన్నాయి. నాన్ నోటిఫైడ్ పంచాయతీ లు 646 ఉన్నాయి. ప్రభుత్వమే వీధి దీపాలు, నీటి పనులకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లిస్తుందనే ఉద్దేశంతో పంచాయతీ పాలకవర్గాలు బిల్లులను చెల్లించడంలేదు. దీంతో బకాయిలు రూ. 96.86 కోట్లకు చేరుకున్నాయి.
గతంలో పంచాయతీలకు పన్నుల వసూలు ద్వారా లభించే ఆదాయం నుంచి విద్యుత్ బిల్లును పాలకవర్గాలు విద్యుత్ సంస్థకు చెల్లించేవి. అయితే ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం, పెరిగిన విద్యుత్ బిల్లులకు పంచాయతీ నిధులు సరిపోకపోవడంతో బిల్లుల భారం పంచాయతీలకు గుదిబండగా మారాయి. దీనిని గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లిం చడానికి ప్రభుత్వం ద్వారా నిధులను వెచ్చించారు. దీంతో పంచాయతీలకు వసూలు అయ్యే పన్నులు, ఇతర నిధుల ను అభివృద్ధి పనులకు వినియోగించే వీలు ఏర్పడింది.
ఇప్పుడు మాత్రం పంచాయతీలకు సంబంధించిన విద్యు త్ బిల్లులను పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించాలని ప్రభుత్వం మౌఖికంగానే ఆదేశాలిచ్చింది. పంచాయతీల కు పన్నులు వసూలు కాకపోతే ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధుల నుంచి బిల్లులు చెల్లించుకోవాలని సూచిం చింది. గతంలో మాదిరిగా విద్యుత్ బిల్లులను తాము చెల్లించలేమని ప్రభుత్వం చెప్పకనే చెప్పడం పంచాయతీ పాలకవర్గాలకు మింగుడు పడటం లేదు.
నోటిఫైడ్ పంచాయతీల బకాయిలు రూ. 41.80 కోట్లు ఉండగా నాన్‌నోటిఫైడ్ పంచాయతీల బకాయిలు రూ. 55.06 కోట్లు ఉన్నా యి. సుమారు ఆరేళ్లుగా బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. పంచాయతీలకు మంజూరవుతున్న నిధులు అంతంత మాత్రంగా ఉండటం, పన్నుల వసూలు సరిగా జరుగకపోవడంతో విద్యుత్ బకాయిల చెల్లింపు ఎలా సాధ్యం అవుతుందని పలువురు సర్పంచ్ లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు.
పంచాయతీలకు షాకిచ్చిన సర్కార్
Published Wed, Jul 30 2014 2:26 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement