వైద్యం వికటించి బాలుడి మృతి | The healing took its toll of the boy's death | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి బాలుడి మృతి

Published Tue, Apr 19 2016 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

వైద్యం వికటించి బాలుడి మృతి

వైద్యం వికటించి బాలుడి మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందాడని కుటుంబసభ్యుల ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని కుటుంబ
సభ్యుల ఆందోళన నర్సింగ్ హోం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం

మహబూబ్‌నగర్ క్రైం : వైద్య వికటించి ఓ బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సింగ్ హోం ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. పాన్‌గల్ మండలం రేమొద్దులకు చెందిన రాములు, సాయిసుధ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వృతిరీత్యా ఇద్దరు మక్తల్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు నితిన్ తేజ (5) ఏర్నియా (కిడ్నీకి) సంబంధించిన వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్ చేయించడానికి సోమవారం జిల్లా కేంద్రంలోని బాలాజీ నర్సింగ్ హోంలో ఆడ్మిట్ చేశారు. వైద్యులు  మీ బాబుకు ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకువెళ్లారు. గంట తర్వాత బాబును బయటకు తీసుకొచ్చారు.

తల్లిదండ్రులు వెళ్లి చూస్తే బాబుకు శ్వాస ఆడటం లేదు. గమనించిన తండ్రి తన కొడుకుకు ఏమైందని నిలదీశాడు. మీ వాడు క్షేమంగా ఉ న్నాడని అక్కడి నుంచి పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి  మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే నితిన్ తేజకు ఎడమ భాగంలో గతంలో ఇదే ఏర్నియా వ్యాధి వస్తే పట్టణంలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం కుడి భాగంలో రావడంతో ఓ స్నేహితుడు ఇచ్చిన సలహాతో ఈ ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం, అనుభవం లేని వారు సరైన వైద్యం అందకపోవడంతో బాబు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు.

బా బు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యా రు. బాబు మృతి  చెందాడనే ఆగ్రహంతో బంధువు లు బాలాజీ నర్సింగ్ హోంకు చెందిన అ ద్దాలు, కిటికీలు, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలియడంతో సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ రా మకృష్ణ, టూటౌన్ సీఐ సోమ్‌నారాయణ సింగ్, ఎస్‌ఐలు రాజేశ్వర్‌గౌడ్, మురళి సందర్శించి బంధువుల కు నచ్చచెప్పారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రి వై ద్యులు మొత్తం అక్కడికి చేరుకుని నష్టపరిహారం చెల్లిస్తామని చర్చలు జరిపారు. ఈ సంఘటనపై వైద్యులను సంప్రదించడానికి యత్నిస్తే అందుబాటులోకి రాలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement