Furniture destroyed
-
నెల్లూరు జిల్లా: కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం..
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కలెక్టరేట్ వెనుక ఉన్న స్టోర్ రూమ్‌లో శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫర్నీచర్ కాలిపోయినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. నెల్లూరు కలెక్టరేట్ వెనుక వైపు ఉన్న స్టోర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో స్టోర్ రూమ్ నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. అది గమనించిన కలెక్టరేట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో స్టోర్ రూమ్‌లోని ఫర్నీచర్ కాలిపోయినట్టు తెలుస్తోంది. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
యడ్యూరప్పకు నిరాశ
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు తీవ్ర నిరాశే ఎదురైంది. కుమారుడు విజయేంద్రతోపాటు, సన్నిహితురాలు శోభా కరాంద్లజే (యశ్వంత్‌పూర్ కోసం) లకు సోమవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ చోటు దక్కలేదు. మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గం నుంచి తన కొడుకు విజయేంద్ర పోటీ చేయడంలేదని నంజనగుడులో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో యడ్యూరప్ప చెప్పారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికతోపాటు.. అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అటు, రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి రేవణ్ణ సిద్దయ్య (లింగాయత్ వర్గం బలమైన నాయకుడు)కు వరుణ నుంచి బీ–ఫామ్ ఇచ్చే అవకాశముంది. రేవణ్ణకు ఆరెస్సెస్‌నుంచి బలమైన మద్దతుంది. వరుణ, యశ్వంత్‌పూర్ సహా మరో రెండు నియోజకవర్గాలకు మంగళవారం అభ్యర్థులను ప్రటించే అవకాశం ఉంది. బళ్లారిలో రెడ్డి సోదరులపైనే ఆధారం తూర్పు కర్ణాటక ప్రాంతంలో గాలి జనార్దనరెడ్డి సోదరులపైనే బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అందుకే శ్రీరాములు, రెడ్డి సోదరుల కుటుంబసభ్యులు, అనుచరులకు ఏడు టికెట్లు ఇచ్చింది. గాలి మేనల్లుడు, రియల్టర్ లల్లేశ్ రెడ్డిని కన్నడ హోం మంత్రి ఆర్ రామలింగారెడ్డిపై (బీటీఎం లేఔట్ నుంచి) పోటీకి దించనుంది. ఈ ప్రాంతంలోని రెడ్డి ఓట్లను బీజేపీ వైపుకు తీసుకురావటంలో గాలి పాత్ర కీలకం కానుంది. బీజేపీ దీనిపైనే విశ్వాసం ఉంచింది. -
వైద్యం వికటించి బాలుడి మృతి
► వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందాడని కుటుంబసభ్యుల ఆందోళన ► వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని కుటుంబ ► సభ్యుల ఆందోళన నర్సింగ్ హోం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం మహబూబ్‌నగర్ క్రైం : వైద్య వికటించి ఓ బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సింగ్ హోం ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. పాన్‌గల్ మండలం రేమొద్దులకు చెందిన రాములు, సాయిసుధ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వృతిరీత్యా ఇద్దరు మక్తల్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు నితిన్ తేజ (5) ఏర్నియా (కిడ్నీకి) సంబంధించిన వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్ చేయించడానికి సోమవారం జిల్లా కేంద్రంలోని బాలాజీ నర్సింగ్ హోంలో ఆడ్మిట్ చేశారు. వైద్యులు మీ బాబుకు ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకువెళ్లారు. గంట తర్వాత బాబును బయటకు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు వెళ్లి చూస్తే బాబుకు శ్వాస ఆడటం లేదు. గమనించిన తండ్రి తన కొడుకుకు ఏమైందని నిలదీశాడు. మీ వాడు క్షేమంగా ఉ న్నాడని అక్కడి నుంచి పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే నితిన్ తేజకు ఎడమ భాగంలో గతంలో ఇదే ఏర్నియా వ్యాధి వస్తే పట్టణంలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం కుడి భాగంలో రావడంతో ఓ స్నేహితుడు ఇచ్చిన సలహాతో ఈ ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం, అనుభవం లేని వారు సరైన వైద్యం అందకపోవడంతో బాబు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. బా బు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యా రు. బాబు మృతి చెందాడనే ఆగ్రహంతో బంధువు లు బాలాజీ నర్సింగ్ హోంకు చెందిన అ ద్దాలు, కిటికీలు, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలియడంతో సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ రా మకృష్ణ, టూటౌన్ సీఐ సోమ్‌నారాయణ సింగ్, ఎస్ఐలు రాజేశ్వర్‌గౌడ్, మురళి సందర్శించి బంధువుల కు నచ్చచెప్పారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రి వై ద్యులు మొత్తం అక్కడికి చేరుకుని నష్టపరిహారం చెల్లిస్తామని చర్చలు జరిపారు. ఈ సంఘటనపై వైద్యులను సంప్రదించడానికి యత్నిస్తే అందుబాటులోకి రాలేదు