నెల్లూరు జిల్లా: కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం.. | Fire Accident In Nellore District Collectorate | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లా: కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం..

Published Sat, Feb 11 2023 12:48 PM | Last Updated on Sat, Feb 11 2023 12:54 PM

Fire Accident In Nellore District Collectorate - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కలెక్టరేట్‌ వెనుక ఉన్న స్టోర్‌ రూమ్‌లో శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫర్నీచర్‌ కాలిపోయినట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. నెల్లూరు కలెక్టరేట్ వెనుక వైపు ఉన్న స్టోర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో స్టోర్‌ రూమ్‌ నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. అది గమనించిన కలెక్టరేట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో స్టోర్‌ రూమ్‌లోని ఫర్నీచర్‌ కాలిపోయినట్టు తెలుస్తోంది. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement