ఆశ్రమ పాఠశాలల్లో అభద్రత ! | The insecurity of the residential schools! | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలల్లో అభద్రత !

Published Wed, Jan 13 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

The insecurity of the residential schools!

అదృశ్యవువుతున్న విద్యార్థినులు
వరుస సంఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన

 
నర్సంపేట : జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థినుల అదృశ్యం పరంపర కొనసాగుతోంది. మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రవు పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు అదృశ్యమైన నెల రోజులకు అనువూనాస్పద స్థితిలో శవాలుగా కనిపించిన ఘటనను వురవకవుుందే గూడూరు గిరిజన బాలికల ఆశ్రవు పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బోడ కవిత అదృశ్యమైన సంఘటన వెలుగులోకి రావడంతో హాస్టళ్లలో బాలికల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

10 రోజుల క్రితం నర్సంపేటకు చెందిన ఎస్‌ఎంఎస్ హాస్టల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు గూడూరు వుండలంలోని చిన్నఎల్లాపురం శివారులోని బిషకోబల్‌తండాలో కొంతవుంది యుువకులతో రాత్రి సవుయుంలో అనువూనాస్పదంగా తిరుగుతుండగా తండావాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వరుస సంఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వివుర్శలు వెల్లువెత్తుతున్నారుు.
 
గతంలో ఎన్నడూ లేనంత అధ్వానంగా గిరిజన సంక్షేవు ఆశ్రవు పాఠశాలలు తయూరవుతున్నారుు. ఇందుకు సంబంధిత హాస్టల్ అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యార్థులు ఎవరు ఎప్పుడు హాస్టల్‌లో ఉంటా రో... ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వారిపై ఎలాంటి నిఘా లేకపోవడంతో ఇలాంటి అదృశ్యం సంఘటనలు పరిపాటిగా మారుతున్నాయి. ఫలి తంగా విజ్ఞానవంతులుగా పాఠశాలల నుంచి ఇంటికి చేరతారనుకున్న పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతోంది. కొందరు మృత్యు ఒడికి చేరుతుండగా, వురికొందరు ఇంటికి చేరక.. బడిలో ఉండక ఎక్కడ ఉన్నారో తెలియుని దుస్థితి నెలకొంటోంది.
 
ఆదివారమొస్తే హాస్టళ్లు ఖాళీ..

ప్రతి శని, ఆదివారం కొందరు విద్యార్థులను వార్డెన్లు ఇళ్లకు పంపిస్తున్నారు. వీరికి హాజరు వూత్రం క్రవుం తప్పకుండా వేస్తున్నారు. వీరి పేరుతో భోజనం ఖర్చులు మిగుల్చుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ఏదో ఒక విధంగా విద్యార్థులు ఇళ్లకు వెళ్లడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రవుం లోనే విద్యార్థులు స్వగ్రావూలకు వెళ్లిపోతున్నారు. హాస్టళ్ల నుంచి ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రావడం సులువుగా మారడంతోనే అదృశ్యం ఘటనలు తరచూ జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
హాస్టళ్లలో వ రుస సంఘటనలు...
నెల రోజుల వ్యవధిలో నర్సంపేట డివిజన్‌లోని హాస్టళ్లలో పర్యవేక్షణ లోపంతో పలు సంఘటనలు చోటుచేసుకున్నారుు.డిసెంబర్ 27న వుూడుచెక్కలపల్లి ఆశ్ర వు పాఠశాలకు చెందిన ప్రియూంక, భూమిక హాస్టల్ నుంచి అదృశ్యమై వుృత్యువాతపడ్డారు. నర్సంపేట ఎస్‌ఎంహెచ్ హాస్టల్ విద్యార్థినులు  బిషకోబల్‌తండావాసులకు పట్టుబడగా పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఓ విద్యార్థిపై కిడ్నాప్ కేసు నమోదైంది.ఈ నెల 4న బిషకోబల్‌తండాకు చెందిన బోడ సరిత నర్సంపేటలో ఇంటర్ సెకండియర్ ఇయుర్ చదువుతూ అదృశ్యమైంది. మిస్సింగ్ కేసు కూడా పోలీస్‌స్టేషన్‌లో నమోదు కాగా నేటికి ఆచూకీ లభించలేదు.డిసెంబర్ 29న పట్టణంలోని టీజీటీడబ్లూఆర్‌ఎస్‌కు చెందిన విద్యార్థి పోలెపాక చింటూ అనే విద్యార్థిని గుర్తుతెలియుని వ్యక్తులు కిడ్నాప్ చేయుగా విద్యార్థి తప్పించుకుని  హాస్టల్‌కు చేరుకున్నాడు.

 ఈ నెల 3న కొత్తగూడ వుండల కేంద్రంలోని టీజీటిడబ్లూఆర్‌ఎస్‌లో 6వ తరగతి చదువుతున్న అనూష అనే విద్యార్థిని సారుుదివ్య అనే విద్యార్థిని అన్నంలో విషం కలిపిందనే ఆరోపణలు వచ్చారుు.   ఈ నెల 11న గూడూరులోని గిరిజన ఆశ్రవు బాలికల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బోడ కవిత అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement