పరోపకారానికి పోయి ఓ సబ్‌స్టేషన్ ఆపరేటర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం కన్నెపల్లిలో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అంబదాస్ (40) మృతి చెందాడు. ఇతడు గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, మూడు స్తంభాలకు బల్బులు పోవడంతో కొత్తవి అమర్చాలని సర్పంచ్ అడగ్గా, కాదనలేక ఆ పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
Published Tue, Oct 20 2015 2:10 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement