మగశిశువు విక్రయం ! | The sale of the male baby! | Sakshi
Sakshi News home page

మగశిశువు విక్రయం !

Published Sat, May 16 2015 4:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

మగశిశువు విక్రయం !

మగశిశువు విక్రయం !

నెక్కొండ : రూ.10 వేలకు తొమ్మిది రోజుల మగశిశువును తల్లి విక్రయించిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నాగారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కడారి ఎల్లమ్మ కూతురు హైమకు పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన బిర్రు ఎలియాతో వివాహమైంది. భార్యభర్తల గొడవ కారణంగా కొద్దిరోజులుగా హైమ తల్లి వద్దనే ఉంటోంది. హైమ ఇటీవల నాలుగో సంతానంగా మగ శిశువుకు జన్మనిచ్చింది. భర్తకు దూరంగా జీవిస్తున్న తనకు నాలుగో బిడ్డను పెంచడం భారమవుతుందని భావించింది.

ఈ క్రమంలో నాగారం గ్రామానికే చెందిన దంపతుల గమనించి.. బిడ్డను పర్వతగిరి మండలంలోని చౌటపల్లికి చెందిన పోతరాజు మహేందర్ దంపతులకు ఇవ్వమని కోరారు. హైమ అంగీకరించడంతో మహేందర్ రూ.10 వేలు ఇచ్చి శిశువును తీసుకెళ్లాడు. విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో వారు 1098 చైల్డ్‌లైన్ సిబ్బందికి, పోలీసులకు సమాచారమివ్వడం.. వారు వచ్చి హైమకు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారికి, బిడ్డను తీసుకెళ్లిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement