ఆరని మంటలు
ప్రతి ఏటా దగ్ధమవుతున్న అడవి
వేడెక్కుతున్న ఏజెన్సీ వాతావరణం
పక్షి, జంతు, వృక్ష జాతుల మనుగడకు ముప్పు
రక్షణ చర్యలు చేపట్టని అటవీ శాఖ
కొత్తగూడ :అటవీ గ్రామాలనగానే వేసవి కాలంలో చల్లగా ఉంటాయనుకుంటారు.. కానీ. ఇక్కడ అందుకు భిన్నంగా కార్చిచ్చు కారణంగా ఏజెన్సీ వాతావరణం మొత్తం వేడెక్కుతోంది. గ్రీష్మ రుతువు రావడంతో అడవిలో చెట్ల ఆకులు రాలుతారుు. రాలిన ఆకులు.. ఎండి ఎక్కడ కొంచెం నిప్పు రవ్వలు పడినా అడవి మొత్తం కాలుకుంటూ పోతుంది. ఈ మంటల్లో అడవిలో ఉండే చిన్న వృక్ష, పక్షు, జంతు జాతులు ఆహుతి అవుతుం టాయి. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో వన్య ప్రాణులు వేటగాళ్లకు చిక్కి కొన్ని, జనావాసాల్లోకి వచ్చి మరి కొన్ని మృత్యువాత పడుతుంటాయి. ఏజెన్సీలో అడవి కాలడానికి వివిధ రకాల కారణాలు ఉన్నా.. ఎక్కువగా తునికాకు ప్రూనింగ్‌కు బదులుగా దగ్ధం చేస్తున్నారని చెబు తారు. గత ఏడాది పూనుగొండ్లలో ఐదు, ఇటీవల చింతగట్టు తండాలో రెండు ఇళ్లు కాలాయి. రాత్రయిందంటే గుట్టల్లో మండే మంటలు.. దీపాల వరుసలా కనిపిస్తుంటాయి.
చేపట్టాల్సిన చర్యలు..
కార్చిచ్చు నుంచి అడవిని కాపాడేందుకు అటవీ శాఖ సిబ్బం ది చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫైర్‌లైన్స్(కాలిబాటలు) వేయడం ద్వారా మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించకుండా కట్టడి చేయడం, అడవిలో ఎండిన ఆకులను ఒక చోటకు ఊడ్చి కాల్చడం, వేసవి మూ డు నెలలకు స్థానికులచే ఫైర్ వాచర్‌లను నియమించడం లాంటి చర్యలు చేపట్టాలి. అవేమీ చేయకపోవడంతో ఏటా అగ్నికి ఆహుతవుుతూనే ఉంటుంది. ఫైర్ వాచర్‌ల నియా మకం, దహనాలను అడ్డుకోవడానికి, సహజంగా వచ్చిన మంటలు ఏటా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుంది. ఇక వాచర్‌లను నియమించినా అధికారులు వారితో ఇతర పనులు చేయించుకుంటున్నట్లు సమా చారం. ఈ విషయమై కొత్తగూడ ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు మాట్లాడుతూ అడవి కాలకుం డా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు ప్రాంతాల్లో ఫైర్ వాచర్లను నియమించామన్నారు.