
పెళ్లైన ఐదు రోజులకే..
పెళైన ఐదురోజులకే కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు.
వనపర్తి: జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. పెళ్లైన ఐదురోజులకే కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని ఖిలాఘనపురం మండలం కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆంజనేయులుకి ఐదు రోజుల కింద పారిజాతం అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన రోజు నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా దంపతుల మధ్య వాగ్వాదం జరగడంతో.. కోపోద్రిక్తుడైన ఆంజనేయులు రోకలిబండతో పారిజాతం తలపై మోదాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో ఉన్న పారిజాతాన్ని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.