ఇంటిదొంగ పనే..! | Theft case accused arrested | Sakshi
Sakshi News home page

ఇంటిదొంగ పనే..!

Published Wed, Jul 13 2016 1:39 AM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

ఇంటిదొంగ పనే..! - Sakshi

ఇంటిదొంగ పనే..!

రోజూ రూ.లక్షల్లో డబ్బు కళ్లజూస్తున్నా.. వచ్చేది అరకొర వేతనమే.. పెరిగిపోతున్న ఖర్చులు.. అవసరాలు తీర్చుకునేందుకు అవస్థలు పడాల్సిన దుస్థితి..ఈ నేపథ్యంలోనే ఆ యువకుడికి దుర్బుద్ధి పుట్టింది. ఏకంగా ఏటీఎంలో డిపాజిట్ చేసే డబ్బును కాజేయాలని తన స్నేహితులతో కలిసి ప్రణాళిక రూపొందించాడు.. అయితే తమ వ్యుహాన్ని అమలు పరిచేందుకు ఉపయోగించిన సెల్‌ఫోనే చివరకు వారిని కటకటాల వెనక్కి నెట్టింది..!  
 
 నల్లగొండ :
  చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో  ఏఎస్పీ గంగారం, డీఎస్పీ సుధాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన సుంకరబోయిన నాగరాజు ఏడాదిన్నర కాలంగా ఏటీఎంలో డబ్బులు పెట్టే ప్యామిడీ క్యాష్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నల్లగొండ మండలం నర్సింగ్‌భట్ల గ్రామానికి చెందిన మొగుదాల గణేష్, బొమ్మగాని గిరి  కొంతకాలంగా జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం గడుపుతున్నారు. వీరిద్దరు జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న నాగరాజుకు స్నేహితులు.
 
 సెటిలైపోదామని..
 ఎంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బతుకీడుస్తామని, ఏకంగా ఏటీఎం డబ్బులే కొట్టేయాలని సుంకరబోయిన నాగరాజు నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులైన గిరి, గణేశ్ చెప్పాడు. ఒక్క చోరీ చేస్తే జీవితంలో స్థిరపడిపోవచ్చని అనుకున్నారు. ముగ్గురు కలిసి నగదును కాజేయాలని ప్రణాళిక రూపొందించారు.
 
 పోలీసుల విచారణలో..
  దుండగులు కంట్లో కారం చల్లి ఏటీఎంలో డిపాజిట్ చేసే డబ్బులతో ఉడాయించారని ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తొలుత డబ్బు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన నాగరాజు, శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. దుండగులు బైక్ నడుపుతున్న శ్రీనుపై కాకుండా వెనుక కూర్చున్న నాగరాజు కంట్లో కారం చల్లడమేంటని అనుమానించారు. అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్ మెసేజ్‌ను కనిపెట్టారు.
 
 దీంతో నాగరాజే సూత్రధారి అని తెలియడంతో జిల్లా కేంద్రంలో ఉన్న ఇద్దరు స్నేహితుల కోసం గాలించారు. డబ్బుతో సహా గణేశ్ పోలీసులకు చిక్కగా బొమ్మగాని గిరి పరారయ్యాడు. ఈ కేసులో సహ ఉద్యోగి చింత శ్రీనుకు ఏలాంటి సంబంధం లేదని ఎస్పీ ప్రకటించారు. కేసును ఛేదించిన సీఐ రమేష్‌కుమార్, ఎస్‌ఐ ఇఫ్తిక్ అహ్మద్, ప్రొబిషనరీ ఎస్‌ఐ రాజు, ఐడీ పార్టీ సిబ్బంది విష్ణు, రవూఫ్, గౌస్ తదితరులను ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి అభినందించారు. వారికి రివార్డు ప్రకటిస్తామన్నారు.  
 
 సెల్‌ఫోన్ మెసేజ్ ఇచ్చి..
 విధి నిర్వహణలో భాగంగా ప్యామిడీ క్యాష్ కంపెనీలో పనిచేస్తున్న చింత శ్రీను, నాగరాజు ఆదివారం నల్లగొండ నుంచి ఎటీఎంలో డబ్బులు పెట్టేందుకు రూ.42.05 లక్షలు తీసుకుని బైక్‌పై మునుగోడుకు చేరుకున్నారు. అక్కడ ఇండిక్యాష్ ఏటీఎంలో రూ.7.50 లక్షలు డిపాజిట్ చేశారు. మిగిలిన రూ.35 లక్షలకు గట్టుప్పల్, కనగల్ మండలాల్లోని ఏటీఎంలలో డిపాజిట్ చేసేందుకు బైకుపై బయలుదేరారు. శ్రీను బైక్ నడుపుతుండగా నాగరాజు వెనుక కూర్చున్నాడు. కొంపెల్లి గ్రామం దాటి వెళుతుండగా తన స్నేహితుడైన గణేష్‌కు నాగరాజు ముందస్తు ప్లాన్ ప్రకారం చో రీ చేసేందుకు రమ్మని సెల్‌ఫోన్‌లో మెసే జ్ పంపించాడు. దీంతో కొంపెల్లి దాటి 2 కిలోమీటర్ల దూరం వెళ్లగానే గణేష్ మరో స్నేహితుడు గిరితో కలిసి బైక్‌పై అక్కడికి వచ్చాడు. బైకు వెనుకాల కూ ర్చున్న శ్రీను కంట్లో కారం చల్లి రూ. 35 లక్షల 50 వేలను తీసుకెళ్లారు. అనంత రం నాగరాజు ఏమీ తేలవన్నట్లుగా ము నుగోడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement