'గవర్నర్ కు విశేషాధికారంలో న్యాయముంది'
న్యూఢిల్లీ: గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాలు ఇవ్వడంలో న్యాయం ఉందని సినీనటుడు, బీజేపీ నేత సురేష్ అన్నారు. ఇది తెలంగాణలో అభద్రతాభావంతో ఉన్న వారికి ఊరటనిచ్చే విషయమని శనివారమిక్కడ అన్నారు. శాంతిభద్రతల అంశాన్ని కేసీఆర్ రాజకీయాలు చేయడం తగదన్నారు. తొలుత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని, ఇప్పుడు హైదరాబాద్‌లో 1956కు ముందు, ఆ తర్వాత అంటూ స్థానికత ద్వారా విభజనకు సిద్ధమయ్యారన్నారు.
రుణమాఫీని పక్కదారి పట్టించేందుకే: జంగారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించడానికి గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాల అంశాన్ని వివాదం చేస్తున్నారని బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి విమర్శించారు.