నల్లగొండ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తూ అధికార పార్టీ నాయకులు రికార్డు సృష్టించారు. గడిచిన మూడు ఎన్నికల్లో వరుస విజయాలను కైవసం చేసుకుంటూ వస్తున్న నేతలు ఈ ఎన్నికల్లో కూడా విజయభేరి మోగించారు. జిల్లాలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. 1983,85 ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండుసార్లు గెలుపొం ది న ఆయన ఆ తర్వాత.. 1989, 1999 , 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుం చి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొం దారు . ప్రస్తుతం జరిగిన ఎన్నిక ల్లో మరోసారి గెలిచి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రికార్డు సృష్టించారు.
మాజీ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004 ఎన్నికల్లో కోదాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందిన ఆయన 2009 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి తిరుగులేని మెజార్టీ సాధించి నాలుగోసారి ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి మూ డుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధిం చారు. 1999 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఈ ఎన్నికల్లో కూడా గెలిచి రికార్డు సృష్టించారు.
ఈ నేతలు... వరుస విజేతలు
Published Sat, May 17 2014 2:43 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM
Advertisement
Advertisement